మొక్కజొన్న కంకి

బాలగేయం

CORN
CORN

మొక్కజొన్న కంకి

మక్క జొన్న కంకి భలే మస్తుగ నుండు కాల్చి తింట నేమో ఎంతో కమ్మగా ఉండు ఉడక బెట్టి తింటె ఉత్సాహముగా నుండు గింజలన్నీ ఒలిచి పెంక పైన పోసి మాడ కాల్చినంక ఉప్పు నీళ్లు పోసి బాగ ఉడక బెట్టి నిమ్మరసము పిండి నెమ్మదిగ తింటుంటె కడుపు నిండిపోవ్ఞ కమ్మటి రుచుల తోడ మక్కలన్ని ఒలిచి మిక్సిలోన వేసి మెత్తగా నూరేసి మక్క గారెలు చేసి మురిపెముగ తింటుంటె అమ్మ ప్రేమ వలెనె కమ్మదనము పొందు ఎండిన మక్కలను కుక్కరులో పోసేసి పాపు కార్ను చేసి పసి పిల్లల కిచ్చినా ఎగిరి గంతులేసుదురు ఆటలెన్నొ ఆడుచు కర కర కొరుకుచు కడుపు నిండ బుక్కుదురు కడు సంభ్రము తోడ

– కోణం పర్శరాములు, సిద్ధిపేట