మొండివైఖరితో ముంచుకొచ్చిన సంక్షోభం

BABU, MODI
BABU, MODI

మొండివైఖరితో ముంచుకొచ్చిన సంక్షోభం

జంతర్‌మంతర్‌ వ్యవహారం మొదటికే మోసం తెచ్చింది.ఆయన ఎపికినిధుల కేటాయింపులో తీసుకున్న మొండి వైఖరి టిడిపి,బిజెపి మధ్య గత నాలుగేళ్లుగా సాగుతున్న పొత్తు సంబంధాలను తెగతెంపులు చేసిం ది.ఫలితంగా తీవ్ర అసంతృప్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తు నుంచి బయటపడే కటువయిన నిర్ణయం తీసుకుని ఎన్‌డిఎ ప్రభు త్వం నుంచి తప్పుకున్నారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానా నికి రంగం సిద్ధంచేశారు.దీంతో రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. పార్ల మెంటులో అవిశ్వాస తీర్మానాన్ని స్పీకరు ఇంకా అనుమతించ కున్నా తీర్మానానికి అనుకూల రీతిలో మద్దతు గట్టిగా సమకూరు తుంది.

ప్రస్తుత రాజకీయ సంక్షోభం ఏమవుతుందో తెలియని పరి స్థితి. ఇటీవలి కేంద్రఆర్థిక బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయింపు నకు సంబంధించి ఎపి ప్రభుత్వం చేసిన ఏ ప్రతిపాదనకు కూడా ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్ల్లీ స్పందించలేదు.సరికదా తాజాగా ప్రత్యేక హోదా,బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపుపై తెలుగుదేశం పార్టీ ఎంత ఆందోళనచేసినా ఆయన మొండిగా వ్యవ హరించారే తప్ప అనునయం చూపించ లేదు. ఆంధ్రాకు 14వ ఆర్థిక ప్రణాళిక నిబంధనలను అనుసరించి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యంకాదని,నిధుల కేటాయింపులో మార్పుఉండదని తేల్చిచెప్పి, మరో సంచలన ప్రకటన చేసారు.

ఆంధ్రా ఆర్థికలోటులో రూ.168 కోట్లు ఇస్తే సరిపోతుందన్నారు. అయితే ఆంధ్రా అడుగుతున్న 16,447 కోట్లు ఎప్పుడిచ్చారు? అనే ప్రశ్నకు ఆయన నుంచి బదు లులేదు.ప్రస్త్తుతం అధికార తెలుగుదేశం పార్టీఎంపీలు, కేంద్రమం త్రులు ఎపి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై కేంద్రాన్ని నిలదీసి, చివరికి తెగతెంపులు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు మార్గదర్శకత్వంతో కేంద్రమంత్రులు సుజనా,అశోక్‌గజపతి రాజులు రాజీనామా చేసారు. అప్పటికే రాష్ట్ర బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాసరావు,మేడికొండ మాణిక్యాలరావు రాజీనామా చేసారు.ఈ వ్యవహారం అంతాగమనిస్త్తే అమరావతి పారిశ్రామిక కారిడార్‌పరిధిలో నూతనంగా స్థాపించే పరిశ్రమలకు అయిదేళ్ళ పాటు ఎక్సై జ్‌సుంకం,ఆదాయపు పన్నుల్ల్లో 100శాతం రాయితీని కల్పించాలంటూ బడ్జెట్‌ రూపకల్పనకు ముందు ఎపి ఆర్థికశాఖా మంత్రి యన మల రామకృష్ణుడు జైట్ల్లీకి రాసిన లేఖను ఆయన పట్టించుకోలేదు.

దీనివలన అమరావతి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్థి తెల్లఏనుగు చందంగా మారింది. కేంద్ర బడ్జెట్‌ రూపకల్ప నకు ముందు ఢిల్లీలో జెట్ల్లీ ఆయా రాష్ట్ట్రాల ఆర్థ్దిక మంత్రులతో నిర్వహించిన సమావేశంలో యనమల చాలా స్పష్టంగా రాష్ట్ట్రానికి అవసరమయిన నిధుల గురించి ప్రస్త్తావించి,వాటిని అత్యవసరంగా విడుదల చేయాలని డిమాండ్‌ చేసిన విషయం పాఠకులకు విది తమే.

ఈ సమావేశంలో ఆయన రాష్ట్రానికి విభజన హమీ చట్టంలో కేంద్రం స్పష్టంగా ఇచ్చిన హమీని అనుసరించి రాష్ట్ట్రానికి రూ.12, 099 కోట్ల్లు రావాల్సివుందని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రస్త్తుతమున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ల్లో ఈ నిధుల కేటాయింపు అత్యవసరమని జైట్ల్లీకి వివరించారు. అంతేకాకుండా కేంద్రం ప్రత్యేక ప్యాకెజీ నిధులను తక్షణం విడుదల చేయాలని ఆయన సూచించారు.ఈ నిధులు ఏవీ కేంద్రం విడుదల చేయలేదు.బడ్జెట్‌లోప్రస్త్తావించలేదు.

బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు కంభం పాటి హరిబాబు రాష్ట్ట్రానికికేంద్రం విడుదల చేసినట్ల్లు చెప్పిన నిధు ల్లో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల అడిగిన నిధుల ఊసులేదు.అంటే బడ్జెట్‌లో ఈ నిధుల విషయాన్ని విస్మరించారనే విషయం అర్థమ గుతుంది.ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద అయిదేళ్ళ పాటు 90శాతం నిధులు ఇవ్వాల్సివుంది.ఆ లెక్కన రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.16,447కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్త్తం నిధులను ఒకే పర్యాయం వినియోగించుకునే ఉద్దేశం లేనందున గ్రాంటు రూపంలో ఇప్పించి ఆ మొత్తాన్ని ఎఫ్‌ ఆర్‌బీఎం నుంచి తప్పించాలని యనమల విజ్ఞప్తి చేసారు.

గుజ రాత్‌ తరహాలోనే ట్రెజరీల్లో జమకూర్చే విధానానికి అనుమతిని వ్వాలని కోరారు. సమావేశంలో జైట్ల్లీ అన్నింటికీ తల ఊపటంతో నిధుల విడుదలపై గంపెడు నమ్మకం పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వా న్ని బడ్జెట్‌ ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసింది. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రూ.1000కోట్లు విడుదల చేయాల్సిన అవసరాన్ని విజయ వాడ,చెన్నైల నడుమ హైస్పీడు రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి, విజయ వాడ,విశాఖ పట్టణం మెట్రోప్రాజెక్ట్‌ నిర్మాణానికి సహకరించాలని యనమల కేంద్రాన్ని కోరారు.అమరావతి నిర్మాణం కోసం ఎపి ప్రభుత్వం వివిధ రకాల అభివృద్ధి, మౌలికాంశాల గురించి చే స్తున్న ఖర్చులను రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్రానికి విశ్లేషించి వివరించిం ది. మొత్తం అమరావతి నిర్మాణ అంచనా వ్యయం రూ.40,788 లుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో కేవలం ఈ ఆర్థిక సంవతంలో రాష్ట్రం కేంద్రం నుంచి కోరిన నిధులు రూ.1000 కోట్లు మాత్రమే కావటం విశేషం.

రాజధాని నిర్మాణానికి సంబం ధించి సీఆర్‌డీఎ ప్రణాళికను అనుసరించి పరిపాలన రంగం అంచ నా రూ.10వేల కోట్లు అవుతుంది .ప్రధాన రహదారులకు రూ. 3,943కోట్లు,ప్రధానరోడ్లుకు మౌలికవసతుల కల్పనకు రూ6.477 కోట్లు, ఇతరరోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.2.094 కోట్లు, వరద నియంత్రణ కోసంరూ.1,450కోట్లు,మౌలిక వసతుల కోసం రూ.1.512కోట్లు ఇపీసీ విధానంలో ఎల్‌ఫీఎప్‌ జోన్ల అభి వృద్ధి రూ.4324కోట్లు, హ్యామ్‌ విధానంలో ఎల్‌ఫీఎఫ్‌ జోన్ల అభి వృద్ధికి రూ.8.224కోట్లు, పరిపాలనా రంగంలో ప్రధాన భవనాల కు రూ.4.942కోట్లు, గృహనిర్మాణానికి రూ.3,276కోట్లు కేటా యించారు.

లభించిన సమాచారం మేరకు కేంద్రం నుంచి రాష్ట్ట్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అనుసరించి నిధులను కోరుతుంది. అది ఒక్క పర్యాయం కాదు.దశల వారీగా విభజన చట్టాన్ని అను సరించి ఇవ్వమంటుంది.అయితే ప్రభుత్వ వినతిని, ప్రతిపాదనలను కేంద్ర మంత్రి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక రాష్ట్రానికి అవ సరమయిన నిధుల విషయంలో ఆర్థికమంత్రి యనమలఢిల్లీ సమా వేశంలోనే కాక అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లో వెల్ల డించారు.

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరిస్తూ యన మల కేంద్రానికి ఆయా సందర్భాల్లో వివరించినా అందుకు అనుగు ణంగా ఎటువంటి ప్రకటన చేయని అరుణ్‌జైట్లీ ఇప్పుడు రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించామని పార్లమెంటులో చెప్పటం విడ్దూరంగా ఉందనే అభిప్రాయం ఎపి ప్రజల్లో ఉంది.

నిజంగానే నిధుల కేటాయింపు జరిగితే ఆర్థికశాస్త్ర నిపుణుడిగా వాసి కెక్కిన జైట్లీ పార్లమెంటులో ఎపి ఎంపీల నుంచిబడ్జెట్‌పై వ్యతిరేకత వ్యక్త మవ్ఞతుంటే వేళ్ళ లెక్కఆధారంగా వాటిని వివరించే వారన్నది సర్వ త్రా వినవస్తున్న వాదన.అందువల్లనే పార్లమెంటు వెలుపల ఎపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎపికి నిధుల కేటాయిం పునకు సంబంధించి వెల్లడించిన వివరాలను నమ్మలేని పరిస్దితిని రాజకీయ విశ్లేషకుల వాదన.ఆయనఇచ్చిన నిధుల వివరాలన్ని అం కెల గారడీ తరహాలో ఉన్నాయనే భావన వ్యక్తమగుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ కేంద్రానికి ఇచ్చిన నిధులకు లెక్కలు చె ప్పింది.

ఇందుకు భిన్నంగా జైట్లీచెప్పిన వివరాలులేవు. జైట్లీ మొండి వైఖరిపట్ల రాష్ట్రప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయింది.అందుకు అను గు ణంగా చంద్రబాబు ఎన్‌డిఎతో తెగతెంపులకు సిద్ధమయ్యారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పటికి కేంద్రం అరుణ్‌ జైట్లీ వాదసను సమర్థిస్త్తుంది.దుగ్గిరాజు పట్టణం పోర్టుకు ప్రత్యామ్నాయం, విశాఖ జోన్‌వలన ప్రయోజనం లేదంటూ కొత్త భాష్యాలు చెప్పుకు వస్తుం ది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తదితరఅంశాలపై అసెంబ్లీలో చంద్ర బాబు స్వయంగా ప్రతిపాదించిన తీర్మానానికి ఈ నేపథ్యంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ.అంతేకాకుండా కేంద్రంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

– ఘంటా విజయకుమార్‌
(రచయిత: జర్నలిస్టు)