మైసూరులో 14నామినేషన్ల తిరస్కృతి

NOMINATION
NOMINATION

బెంగళూరు: మైసూరుజిల్లాలో వివిధ పార్టీలు దాఖలుచేసిన నామినేషన్లలో 14 నామినేషన్‌పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈజిల్లాలో మొత్తం 11 నియోజకవర్గాలున్నాయి. మొత్తం 183 మంది అభ్యర్ధులు దాఖలుచేసిన నామినేషన్లు చెల్లుబాటవుతాయని ప్రకటించారు. మొత్తం 197 మంది నామినేషన్లు దాఖలుచేసారు. ఈనెల 17,24తేదీల్లోనే వీరంతా నామినేషన్లు దాఖలుచేసారు.పరిశీలన అనంతరం 14 నామినేషన్లు తిరస్కరించారు.వీటిలో తొమ్మిది పత్రాలు స్వతంత్రఅభ్యర్ధులకు చెందినవే ఉన్నాయి. ఆరు నామినేషన్లుకృష్నరాజ నియోజకవర్గంనుంచి తిరస్కరిస్తే మరో మూడు నామినేషన్లు టి.నరసిపూర్‌నియోజకవర్గంలో తిరస్కరించారు. చాముండేశ్వరినుంచి ఒకటి, హున్సూరునుంచి రెండు నామినేషన్లు తిరస్కరించారు. ఇక హసన్‌పరంగాచూస్తే ఏడు అసెంబ్లీనియోజకవర్గాలకు 14 నామినేషన్లు తిరస్కరించారు. మొత్తం 80 మంది అభ్యర్ధులు 123నామినేషన్లు దాఖలుచేసారు. 66 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం అనుమతించింది. అర్కాల్‌గడ్‌, ఆర్సికేరే, శ్రావనడెలగోలా, హసన్‌ నియోజకవర్గాలనుంచి ఒక్కొక్కటిచొప్పున, ఏడు నామినేషన్లు సక్లేష్‌పూర్‌, బేలుర్‌నుంచి మూడునామినేషన్లు తిరస్కరించారు. హోలేనర్సిపూర్‌ అన్ని నేమినేషన్లు ఆమోదించారు. ఇక మాండ్యజిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే రెండునామినేషన్లు తిరస్కరించారు. మొత్తం 115 నామినేషన్లు దాఖలయ్యాయి. 113 తిరస్కరించారు. కెఆర్‌పేట్‌ అసెంబ్లీనియోజకవర్గంలో నారాయణగౌడను అధికారిక జెడిఎస్‌ అభ్యర్ధిగాప్రకటించారు. చామరాజనగర్‌ ప్రాంతంలో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగునామినేషన్లు తిరస్కరించారు. 53 మంది నామినేషన్లు దాఖలుచేస్తే నలుగురి నామినేషన్లుతిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27వ తేదీ చివరిరోజుగా ప్రకటించారు.