మైన‌ర్‌పై అత్యాచారం.. నిందితుడికి జైలు శిక్ష‌

Rape on Minor
Rape on Minor

తమిళనాడు: మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో ఓ రైతుకు పదేళ్ల జైలు శిక్ష విధించింది మహిళా కోర్టు. 2016లో పెరంబూర్‌లో శివప్రకాశం అనే 59 ఏళ్ల రైతు 12 ఏళ్ల బాలికను అపహరించి, ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎన్ విజయకాంత్ నిందితుడు శివప్రకాశంకు పదేళ్ల జైలుశిక్షతోపాటు 10వేలు జరిమానా విధించారు. ఆరియాలూర్ జమీన్‌కు సమీపంలో సదరు బాలిక ఆడుకుంటుండగా శివప్రకాశం మాయమాటలు చెప్పి ఆమెను ఎత్తుకెళ్లాడు. బాలికను రేప్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు బాలికను ఆస్పత్రిలో చేర్పించి..శివప్రకాశంను పోలీసులకు అప్పగించారు.