మైనార్టీ విద్యార్ధుల చ‌దువుకు రూ. 500 కోట్లుః హ‌రీష్‌

HARISH RAO
HARISH RAO

సంగారెడ్డిః జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చిన్నారులకు మంత్రి పోలియో చుక్కలు వేశారు. మైనార్టీ మహిళలకు 500 కుట్టు మిషన్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మైనార్టీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మైనార్టీ పిల్లల చదువు కోసం 206 గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. రూ.500 కోట్లు మైనార్టీ విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
విదేశాల్లో విద్యనభ్యసించే మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తున్నాం. హైదరాబాద్‌లో పదెకరాల్లో ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రం నిర్మించబోతున్నాం. కలెక్టర్లకు, మంత్రులకు త్వరలో ఉర్దూ అనువాదకులను నియమిస్తామని పేర్కొన్నారు.