మైనారిటీల సంక్షేమాభివృద్ధికి నిధులు విడుదల

ap logo
AP Logo

హైదరాబాద్‌: మైనారిటీల పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ పట్టణం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో 8 ఉర్దూ ఘర్‌ కమ్‌ షాదీఖానాల నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎడుపుగల్లు గ్రామంలో మసీదు నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశారు.