మైక్రోసాఫ్ట్‌ ద్వారా కైజలా యాప్‌

AP CM
AP CM Chandrababu Naidu

మైక్రోసాఫ్ట్‌ ద్వారా కైజలా యాప్‌

అమరావతి: మైక్రోసాప్ట్‌ ద్వారా కైజాలా యాప తీసుకొచ్చామని సిఎం చంద్రబాబునాయుడు అనఆనరు.. మీడియాతో ఆయన మాట్లాడారు.. కృష్ణాపుష్కరాల సమయంలో ఈ యాప్‌ను ఉపయోగించామన్నారు.. ఇంకొంచెం ముందుకెళ్లి కనెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ సిఎం యాప్‌ను తీసుకొచ్చామన్నారు. ఈ యాప్‌లో కొన్ని ప్రశ్నలుంటాయని, వాటిని వచ్చిన సమాధానాలు పరిశీలిస్తామన్నారు.. జియో ట్యాగింగ్‌ ద్వారా ఎక్కడనుంచిఏ ఫోన్‌ వచ్చిందో తెలుసుకుంటామన్నారు.

యాప్‌లో కాన్ఫిడెన్షియల్‌ ఆప్షన్‌

ఈ యాప్‌లో కానిఫడెన్షియల్‌ ఆప్షన్‌ కూడ ఎంచుకోవచ్చని సిఎం అన్నారు.. రాష్ట్రాభివృద్ధికి అందరి సలహాలు, సూచనలు తప్పసరి అని అన్నారు. కులం, మతం , ప్రాంతపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. ఓ నిర్ణయం తీసుకంఉటే అది అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నారు.

కైజలా, కనెక్ట్‌ ఎపి సిఎం యాప్‌

ప్రస్తుతం కైజాలా యాప్‌, కనెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ సిఎం యాప్‌ ఉన్నాయని తెలిపారు. ఈనెల20న కాల్‌సెంటర్‌ ప్రారంభిస్తామన్నారు.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫీడ్‌ను పరిశీలిస్తున్నామన్నారు. సమర్ధపాలన అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.. ప్రభుత్వ పనితీరుపట్ల మీరు సంతృపిఈతగా ఉన్నారా అనే ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చామన్నారు. యాప్‌ రిలీజ్‌ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు1655 రెస్సాన్స్‌ వచ్చాయన్నారు..మాకు వచ్చిన సమాధానాల ప్రకారం విశ్లేషణ చేసుకుంటామన్నారు.