మైక్రోసాఫ్ట్‌లో నాలుగువేల ఉద్యోగాల కోత

MS
MS

మైక్రోసాఫ్ట్‌లో నాలుగువేల ఉద్యోగాల కోత

న్యూయార్క్‌, జూలై 8: ఐటిరంగంలో మరింతగా ఉపాధిపై కోతపెరుగుతోంది. మైక్రోసాప్ట్‌ లాంటి కంపెనీ యే అమెరికా బయట దేశాల్లో నాలుగువేల ఉద్యోగాలపై వేటువేస్తోంది. ఇదేదారిలో మరికొన్ని కంపెనీలు నడుస్తాయని నిపుణుల అంచనా. మైక్రోసాప్ట్‌ అధికార ప్రతినిధి ఇదేవిషయమై స్పందిస్తూ తమ కస్టమర్ల కు మరింతమెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. అమెరికా బైట ప్రాంతాల్లోనే ఎక్కువగా మూడునుంచి నాలుగువేల ఉద్యోగాల్లో కోతపడుతుందని అంచనా. ఇప్పటికే కోతపడుతున్న ఉద్యోగుల వివరాలతో జాబితాలు రూపొందించినట్లు సమాచా రం. ప్రత్యేకించి ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచి ప్రస్తుత అవస రాలకు అనుగుణంగా కంపెనీ సేవలను మార్చేందుకేనని మైక్రో సాప్ట్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. గతవారంలోనే మైక్రో సాప్ట్‌ తన మార్కెటింగ్‌, సేల్స్‌టీమ్‌లను పక్షాళనచేస్తామని ప్రక టించింది.

ఈ విభాగంలోనే ప్రపంచ వ్యాప్తంగా 50వేల మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ పునర్‌వ్యవస్థీకరణ కేవలం ఒక క్రమబద్ధీకరణ మాత్రమేనని కంపెనీ అప్పట్లో ప్రకటించిం ది. రానున్న రోజుల్లో మైక్రోసాప్ట్‌కు 4.5 లక్షలకోట్ల డాలర్ల మార్కెట్‌ అవకాశాలున్నాయని కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. మైక్రోసాప్ట్‌ క్లౌడ్‌సేవలను డేటా అనలి టిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌వంటివి కంపెనీలకు ఎంతోమద్దతిస్తున్నాయని వివరించింది. మైక్రోసాప్ట్‌ టూల్స్‌ వినియోగించి కీలక విభాగాల్లో మరింత మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. మైక్రోసాప్ట్‌కు 71వేలమంది ఉద్యోగులు అమెరికాలోను, 1.21లక్షలమంది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నట్లు అంచనా.