మైక్రోఫైనాన్స్‌ వాటా కొనుగోలుపై బ్యాంకుల ఆసక్తి

banks
banks

మైక్రోఫైనాన్స్‌ వాటా కొనుగోలుపై బ్యాంకుల ఆసక్తి

ముంబై: పెద్దపెద్ద రుణాలిచ్చి రికవరీలకోసం అష్టకష్టాలుపడటం కంటే చిన్నచిన్న రుణాలిచ్చి సకాలంలో రికవరీ చేసుకోవడం వల్ల లాభదాయ కత మార్జిన్‌ కూడా పెరుగుతున్నదన్న భావనతో బ్యాంకులు ఈ రంగం వైపు దృష్టిపెడుతున్నాయి. మైక్రోఫైనాన్స్‌సంస్థలు ఇచ్చేరుణాల తరహాలోనే బ్యాంకు లు చిన్న రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకోసమే బ్యాంకు లు మైక్రోఫైనాన్స్‌ సంస్థల్లో వాటాల కొనుగోలును ఎక్కువ మక్కువ చూపిస్తు న్నాయి. గత ఏడాది డిసెంబరు చివరినాటికి బ్యాంకులు మైక్రో ఫైనాన్స్‌విభాగంలో 37శాతంఅంటే 36,683 కోట్ల రూపా యలు రుణపరపతిని అందించాయి. మొత్తం ఈ రంగానికి 98,625కోట్లు ఐదేళ్ల కాలంలో జారీచేసి నట్లు అంచనా. ఎక్కువ మార్జిన్లు, ఎక్కువ పరి మాణంలో ఇస్తున్న రుణాలవల్లనే మైక్రోఫైనాన్స్‌ మార్కెట్‌కు బ్యాంకులు ఎక్కువ ఆసక్తి చూపు తున్నాయి. ఎక్కువశాతం మైక్రోఫైనాన్స్‌ రుణా ల్లో ప్రైవేటురంగానిదే పైచేయిగాఉంది. మొత్తం 11బ్యాంకులు యాక్సిస్‌, బంధన్‌, డిసిబి, ఈక్వి టాస్‌, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఐడిఎఫ్‌సి, కోటక్‌ మహీంద్ర, ఆర్‌బిఎల్‌,ఎస్‌బ్యాంకులు ఈ రుణపరపతి వైపు ఎక్కువ మొగ్గుచూపించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ఎక్కువ సంఖ్యలో మైక్రోఫైనా న్స్‌ రుణాలకు ఆసక్తిచూపించాయి. ఎక్కువగా తమవద్ద ఉన్న బిజినెస్‌ కర స్పాండెంట్ల ద్వారా ఈ రుణాలు జారీ చేస్తున్నాయి. గడచిన 18 నెలల్లో బ్యాం కులు మైక్రోఫైనాన్స్‌ సంస్థల్లో ఈక్విటీ వాటాలు కొనుగోలు ఎక్కువ ఉంది. గతఏడాది కోటక్‌మహీంద్ర బ్యాంకు బెంగళూరులోని బిఎస్‌ఎస్‌ మైక్రోఫైనాన్స్‌ ను కొనుగోలుచేసింది. ఆర్‌బిఎల్‌ పదిశాతం ఉత్కర్షన్‌ మైక్రోలో వాటాలు కొను గోలు చేస్తే తదనంతరం చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుగా మారింది. గత జూలైలోనే ఐడిఎఫ్‌సి బ్యాంకు ట్రిచికేంద్రం గా ఉన్న గ్రామ విదియాల్‌ మైక్రోఫైనాన్స్‌ను కొనుగోలుచేసింది. అంతకు ముందు తూర్పుప్రాంతంలోని ఎఎస్‌ఎ ఇంటర్నేషనల్‌ ఇండియా మైక్రో ఫైనాన్స్‌ లో పదిశాతం వాటాలు కొనుగోలు చేసింది. గత ఏడాది మార్చినెలలో డిసిబి బ్యాంకు 5.81శాతం వాటాలను ఒడిశా కేంద్రం గా పనిచేస్తున్న అన్నపూర్ణ మైక్రో ఫైనాన్స్‌లో కొనుగోలు చేసింది. ఆర్‌బి ఎల్‌ బ్యాంకు కూడా 30శాతం వాటా లను స్వధార్‌ ఫిన్‌సెర్వ్‌లో కొనుగోలు చేసింది. మైక్రోఫైనాన్స్‌రంగంలో కొన్ని నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్‌ కంపెనీలు కూడా ఆసక్తి చూపించాయి. మణప్పురం ఫైనాన్స్‌ ఆశీర్వాద్‌ మైక్రోఫైనాన్స్‌ను కొనుగోల ుచేసింది. అనేక సూక్ష్మరుణ సంస్థలు చిన్నఫైనాన్స్‌ బ్యాంకులు గా రూపాంతరం చెందుతున్నాయి. మైక్రోఫైనాన్స్‌ రంగంలో మరిం తగా వృద్ధి ఉంటుందని అంచనా. చిన్నఫైనాన్స్‌ బ్యాంకులుగా వచ్చిన వాటిలో మొత్తంగాచూస్తే 46శాతం వాటాతో మైక్రోఫైనాన్స్‌ పోర్టుఫోలియో ఉంది. ఈ మొత్తం వాటా రూ.26,228 కోట్లుగా ఉంటుందని అంచనా.

=====