మేలు చేసే దినుసులు

MASALA
MASALA

మేలు చేసే దినుసులు

చలికాలంలో వచ్చే అనారోగ్యాలకు విరుగుడుగా మన ఇళ్లలోని మసాలా దినుసులు పనికొస్తాయి. వంటలో వాడే లవంగం, యాలకులు, అల్లం, పసుపు, దాల్చినచెక్క వంటివన్నీ మేలు చేస్తాయి.

లవంగం: గొంతులో గరగరగా ఉంటే లవంగం నమలండి. దగ్గును నివారించగల శక్తి దానికుంది. టీలో, రసంలో, పప్పులో,కూరల్లో రెండు మూడు లవంగాలు వేసుకుంటే జలుబు, దగ్గు సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.

యాలకులు: చలికాలంలో యాలకుల టీ తాగడం మంచిది. రాత్రివేళ పడుకునే ముందు ఒక చిన్న కప్పు నీటిలో రెండు మూడు యాలకులు వేసి మరిగించి దానికి ఒక స్పూన్‌ తేనె కలుపుకుని తాగితే ముక్కుదిబ్బడ, ఛాతీలో కఫం నుండి విముక్తి లభిస్తుంది. యాలక్కాయల సువాసనకు మూడ్‌ని మార్చగలిగిన శక్తి కూడా ఉంది.

అల్లం: వంటకాలలో అల్లం, వెల్లుల్లి ముద్దగా నూరి వాడటం మన ప్రాంతపు అలవాటు. చలికాలంలో సూప్‌ తాగడం మంచిది. ఆ సూప్‌కి తాజా అల్లం కలపండి. చికెన్‌సూప్‌లోనూ అల్లం, వెల్లుల్లి కలిపితే గొంతు, ఛాతీలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి.

పసుపు: ప్రకృతి సహజమైన సూక్ష్మజీవ సంహారిణి పసుపు. చాలా రకాల మాత్రల కన్నా పసుపు ద్వారానే త్వరగా జబ్బులు తగ్గుతాయి. వంటల్లో పసుపు వాడటం మన అలవాటు. పసుపును పాలలో కలిపి తాగవచ్చు. ఇలా చేయడం వల్ల దగ్గు తగ్గుతుంది.

దాల్చినచెక్క: శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచే గుణం ఈ దినుసులో ఉంది. ఇది తీసుకుంటే శరీరానికి వేడి పుడుతుంది. దీని ప్రభావాన రోగనిరోధక వ్యవస్థ మెరుగువ్ఞతుంది. దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్‌ తేనె, గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే చలికాలపు ఇబ్బందుల నుండి రక్షణ వస్తుంది. దీనిని అల్లంతో కలిపి వాడినపుడు జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.