మేయర్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా

Bontu Rammohan
Bontu Rammohan

Hyderabad: నగర మేయర్ బొంతు రామ్మోహన్ వినియోగించే వాహనానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఐ ల్యాబ్ వద్ద నో పార్కింగ్ బోర్డు పక్కనే మేయర్ తన వాహనాన్ని నిలిపారు. ఆ ఫోటోను అప్ లోడ్ చేస్తూ ట్విటర్ లో ఓ నెటిజన్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. రూ.135 చలానా పంపుతున్నట్లు పోలీసులు ట్విటర్ లో తెలిపారు. ఈ వ్యవహారంపై మేయర్ స్పందించారు. రాంగ్ పార్కింగ్ చేయడం తప్పేనని అంగీకరిస్తూ.. ఇది తనకు తెలియకుండా జరిగిందని అంగీకరించారు. ఆ సమయంలో రోడ్డుపై అపరిశుభ్రత నెలకొనడంతో తాను వాహనాన్ని ఆపమన్నానని తెలిపారు. ఈ విషయంలో నెటిజన్ల ప్రశ్నించే తత్వాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు.