మేమిద్దరం కలిసి నడవాలని ప్రపంచం కోరుతోంది

TRUMP, PUTIN
TRUMP, PUTIN

పుతిన్‌తో చర్చల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
న్యూఢిల్లీ: ప్రపంచంమొత్తం మనిద్దరం కలిసి నడవాలని కోరుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కరచాలనం చేస్తూ చెప్పారు. చారిత్రక సదస్సు ఈ రెండుదేశాధ్యక్షుల భేటీ ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకిలో సోమవారం ప్రారంభం అయింది. మన వివాదాలను పక్కనపెట్టి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని వివాదాలను పరిష్కరించాలని పుతిన్‌సైతం ప్రతిగా స్పందించారు. హెల్సింకిలో వీరిద్దరి సమావేశంప్రారంభానికి ముందే మీడియాతో పాలుపంచుకున్నారు. ఈ రెండుదేశాల సంబంధాలు, సమస్యలు, ప్రపంచ దేశాలసమస్యలు పరిశీలించి పరిష్కరించేందుకు ఇదే అనువైన వేదిక అని పుతిన్‌ పేర్కొన్నారు. సమావేశంలో రష్యాకు చెందిన హ్యాకర్లను తమకు అప్పగించాలని పుతిన్‌ను కోరతామని సైతం ట్రంప్‌ వెల్లడించారు. సిరియా వివాదాలు, హింసాత్మక వాతావరణం, ఉక్రెయిన్‌ వివాదం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం, ఇక పాశ్చాత్యదేశాల ఆంక్షలు వంటివి చర్చల్లో ప్రధానంగా చోటుచేసుకుంటాయని చెపుతున్నారు. చర్చల ద్వారా రెండుదేశాలమధ్య అనితరసాధ్యమైన సంబంధాలు కొనసాగుతాయని ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఫుట్‌బాల్‌ప్రపంచ కప్‌కు రష్యా ఆతిధ్యం ఇవ్వడాన్ని ట్రంప్‌ పుతిన్‌ను అభినందించారు. ఆదివారంమాస్కోలో క్రెమ్లిన్‌ అధినేత హాజరుతోనే ఈ టోర్నీ ముగింపుజరిగింది. ఈ సదస్సులో వాణిజ్యం నుంచి సైనిక విభాగం ఆపై క్షిపణులు, చైనాకు అణుసరఫరా వంటి అన్ని అంశాలు చర్చకువస్తాయని ట్రంప్‌ వెల్లడించారు. రెండుదేశాలపరంగా చర్చలతోనే సాధించుకోవాల్సినవి అనేకం ఉన్నాయని గడచినకొన్నేళ్లుగా ఇరువురం కలిసిన సందర్భాలే లేవని ట్రంప్‌ పేర్కొన్నారు. అధ్యక్ష స్థానంలో సుదీర్ఘకాలం ఉండలేనని, అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇద్దరు కలుసుకునేందుకు రెండేళ్లకాలం పట్టిందని అన్నారు. ఈసదస్సులో అణునిరాయుధీకరణకూడా చోటుచేసుకుంటుందనిఅన్నారు. రష్యా అణు ఆయుధ సంపత్తిని వేగవంతంగా ఆధునీకరించడంపై కూడా చర్చల్లో ప్రస్తావనకు వస్తుందన్నారు. ప్రపంచం మొత్తం మా రెండుదేశాలు మిత్రులుగా కొనసాగాలని అభిలషిస్తున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. మేమిద్దంసైతం రెండు గొప్ప అణుశక్తి ఉన్న దేశాధినేతలమని ప్రపంచం మొత్తంమీద 90శాతం అణుఇంధనంలో వాటా తమదేనని అన్నారు. ఇద్దరు నేతలు తమతమ దుబాసీల పర్యవేక్షణలో అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చలుజరిపారని అంచనా. ఓపక్క సమావేశంజరుగుతుండగానే గర్భస్రావం హక్కుల కార్యకర్తలు, ఫాసిస్టు వ్యతిరేకశక్తులు వీధుల్లోనికి వచ్చి వీరిద్దరికి వ్యతిరేకంగా నినాదాలుచేసారు. అమెరికా రష్యా సంబంధాలు గతంలో కూడా ఎప్పుడూ అధ్వాన్నంగా లేవన్న ట్రంప్‌వ్యాఖ్యలపై రష్యా విదేశాంగశాఖ సైతం ఏకీభవించింది. ప్రపంచ ఉత్తర్వులను ధిక్కరించకూడదని యూరోపియన్‌యూనియన్‌ప్రతినిధులు పేర్కొన్నారు. యురోపియన్‌ యూనియన్‌ మండలి అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌మాట్లాడుతూ రాజకీయంగాను, ఆర్ధికపరమైన ఆంక్షలను ధిక్కరించకూడదని, వీటివల్ల యూరోప్‌లో శాంతి కరువవుతుందని చైనాను మరింత వృద్ధిచేయడమేనని వెల్లడించారు. రష్యా అధ్యక్షుని అధికారప్రతినిధి మాట్లాడుతూ ప్రస్తుతం ఇరుదేశాధినేతలమధ్యజరుగుతున్న చర్చలు బాల్యదశలోనే ఉన్నాయని పేర్కొన్నారు.