మేని సౌందర్యానికి ఏవి మేలు!

SKIN CARE
SKIN CARE

మేని సౌందర్యానికి ఏవి మేలు!

సౌందర్యాన్ని నిర్వచించినపుడు చర్మకాంతి ముందు వరుసలోనే ఉంటుంది. మెరుపులీనే చర్మం చూసే కళ్లను ఆకట్టుకుంటుంది. అంతేకాదు, వయసుని చెప్పే శారీరక లక్షణాల్లో కూడా చర్మానిదే ప్రధమస్థానం. యవ్వనవంతమైన చర్మం ఉన్న వారు తక్కువ వయసున్న వారిలా కనిపించడం అందరికీ తెలిసిన విషయమే. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మకాంతి తగ్గుతుండటం సహజమే. పెదవుల పక్కన, కళ్ల దగ్గర, మెడమీద కనిపించే ముడతలు పెరుగుతున్న వయసుని చెబుతుంటాయి. ప్రత్యేకంగా వయసు కారణంగా చర్మంలో వచ్చే ఇలాంటి మార్పులను నిరోధించేందుకు ఆయా వయసులకు తగ్గ అవసరాలను బట్టి సౌందర్య ఉత్పత్తులు నేడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి- ఇలా వివిధ వయసుల్లో వచ్చే చర్మసమస్యలు నివారించేందుకు మూడు రకాలుగా సౌందర్య ఉత్పత్తులు దొరుకుతున్నాయి.

చర్మానికి సంబంధించిన పలు సమస్యల కోసం దొరికే ఎన్నో సౌందర్యసాధనాలు మనకు తెలుసు. అయితే అన్ని సౌందర్య సాధనాలు అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. అందుకే చర్మ తీరుని, రంగుని బట్టి వాడేందుకు వివిధ క్రీములు లోషన్లను ఆయా ఉత్పత్తి దారులు తయారుచేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో ఇపుడు మరొక ప్రత్యేక పద్ధతిలో సౌందర్య సాధనాలు తయారవుతున్నాయి. వయసుల్లో తేడాలను బట్టి వచ్చే చర్మ మార్పులను ఇవి తగ్గించగలుగుతాయి.

ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్యానికి వాడే మందుల్లా ఇవి పెరిగే వయసు తెచ్చే మార్పుల నుంచి చర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. 30 ఏళ్ల లోపు మహిళల చర్మం సున్నితంగా ఉంటుంది. 30 ఏళ్లు దాటితే మొహంలో వయసు పెరుగుతున్న చిహ్నాలు కనబడుతుంటాయి. నిదానంగా ముడతలు ప్రారంభమవుతాయి. చర్మం తీరుని బట్టి ఇవి కొందరిలో మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక 50 సంవత్సరాలు వయసు దాటితే చర్మంలో మతకణాలు, పిగ్మంటేషన్‌ మొదలైన సమస్యలు మొదలవుతాయి. ఇలా వివిధ వయసుల్లో వచ్చే చర్మ సమస్యలు నివారించేందుకు మూడురకాలుగా సౌందర్య ఉత్ప త్తులు దొరుకుతున్నాయి.

చర్మ సంరక్షణ కోసం బ్యూటీపార్లర్ల వరకు వెళ్లేందుకు అనువైన పరిస్థితులు, సమయం లేని వారు వీటిని వాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రకపు సౌందర్య ఉత్ప త్తులు తయారై మహిళల సౌందర్యానికి సరికొత్త మెరుగులు దిద్దుతున్నాయి. ఇటువంటి కంపెనీల్లో అమెరికాకు చెందిన ఎలిజిబెత్‌ ఆర్‌డన్‌ అనే కాస్మొటిక్‌ కంపెనీ కూడా ఒకటి. వీరి ఉత్పత్తులు మనదేశంలో లభిస్తున్నాయి. 30 సంవత్సరాల లోపు వారికోసం ఒక క్రీమ్‌, 30 ఏళ్లు దాటిన వారికోసం మరొక క్రీమ్‌, 50 ఏళ్లు దాటిన వారికోసం రకరకాల ఉత్పత్తులు మార్కెట్‌లో దొరుకు తున్నాయి. వీటి ధర సుమారు ఆరువందల నుంచి మూడువేల రూపాయల లోపు ధరల్లో లభ్యమవుతున్నాయి. ఇవే కాక ఫ్యాట్‌ కంట్రోల్‌ క్రీమ్‌ కూడా మహిళా వినియోగదారులను ఆకర్షిస్తోంది. మంచి ఆహార అలవాట్లతో పాటు దీనిని వాడటం వల్ల శరీరం తీరుగా ఉంటుందని ఈ క్రీమ్‌ ఉత్పత్తి దారులు అంటున్నారు.