మేని సొగసులు

Cute1
Cute

మేని సొగసులు

నిమ్మరసం:
చాలా తేలిక అయిన చిట్కా ఇది. టేబుల్‌స్పూన్‌ నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత ముఖం కడుక్కుంటే మిలమిలమెరుస్తూంటుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని శరీరం మొత్తం పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

టమాటరసం:
టమాట రసాన్ని స్నానానికి ముందు ముఖం అంతా పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం స్నానం చేస్తే మంచిది. ఓట్‌మీల్‌: ఓట్‌మీల్‌, బాదంపప్పులను పొడిచేసి దానిలో పాలు, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరమంతా పట్టించి స్నానం చేస్తే మంచిది.

పాలు:
ముఖంమీది మురికిని తొలగించడానికి పాలు బాగా ఉపకరిస్తాయి. రాత్రి పడుకోవడానికి ముందు పాలతో ముఖంమీద ఉన్న మురికిని తొలగించి అనంతరం మాయిశ్చరైజర్‌ అప్ల§్‌ు చేసుకోవాలి. పాలు చర్మసౌందర్యాన్ని పరిరక్షించ డంలో బాగా ఉపకరిస్తుంది.

చర్మం లోపలిదాకా వెళ్ళి మురికిని తొలగించడమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తుంది. శాండల్‌ఉడ్‌: శాండల్‌ ఉడ్‌ పౌడర్‌లో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.