మేని సంరక్షణకు…

beautiful skin
beautiful skin

మేని సంరక్షణకు…

 

బీట్‌రూట్‌ చిన్నచిన్న ముక్కలుగా చేసి రుబ్బాలి. దాని నుండి రసాన్ని పిండి ఆ రసాన్ని ముఖానికి ఐదు నిమిషాల సేపు మసాజ్‌ చేయాలి. తరువాత 10నిమిషాలు ఆగి తేలికైన సబ్బు లేక శనగపిండితో కడగాలి. ్జ వేడితేనెలో నిమ్మరసం కలిపి ముఖానికి పూయాలి. అది ఆరిన తర్వాత కడుక్కోవాలి. ్జ సహజ శుభ్రతకోసం…పాలు, నిమ్మరసం కలపాలి. పాలు నిమ్మరసం కలపడంతోటే విరిగిపోతాయి. ఈ మిశ్రమంతో మీ శరీరానికి మసాజ్‌ చేయాలి.
కేరట్‌ కోరు ఉడికించి మీ శరీరానికి మసాజ్‌ చేస్తే మీ చర్మం కాంతివంతంగా, మృదువ్ఞగా మారుతుంది.
పాలమీగడలో పిండిని కలిపి ఆ ముద్దను కళ్లు, కనుబొమ్మలు, పెదవ్ఞలు మినహాయించి తక్కిన చర్మానికి పట్టించుకొని ఐదు నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇది మీ చర్మాన్ని మృదువ్ఞగా చేస్తుంది. ్జ పసుపు, గంధం, ఆలివ్‌నూనె కలిపి మీ శరీరానికి పట్టించుకోవాలి. పదినిమిషాల తర్వాత కడుక్కోవాలి. మీ శరీరాన్ని పాలతో మసాజ్‌ చేసుకోవాలి. పాలల్లో తేమ కల్గించే గుణం ఉంది. ఇది మీ చర్మాన్ని మృదువ్ఞగా ఉంచుతుంది.
ఉమీ గది ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో హ్యుమిడి ఫైయిర్‌ను ఉపయోగించి ఉంచుకున్నట్లయితే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది. ్జ వీలైనంతలో గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎక్కువసేపు స్నానం చేసినట్లయితే, మృతచర్మం దానంతట అదే తొలగిపోతుంది. చర్మాన్ని బరబరా రుద్దకుండా మెల్లగా రుద్దండి. ్జ పసుపు పాలపై మీగడతో కలిపి, ఆ మిశ్రమంతో మీ శరీరాన్ని మసాజ్‌ చేసుకోవాలి. ్జ మీరు ఎక్కువగా ఎండలో తిరగడం వలన చర్మం నల్లబడుతున్నట్లయితే, దోసకాయ రసం సగం కలిపి ఈ చర్మానికి పట్టించుకొని, పదినిమషాల తర్వాత కడుక్కోవాలి. ్జ ఆవనూనె మీ చర్మానికి పట్టించి ఐదునిమిషాలు ఆగి శనగపిండి కాని, తేలికపాటి సబ్బును కాని ఉపయోగించి స్నానం చేయాలి.
గులాబీరేకులను గ్రైండ్‌ చేసి, పాలమీగడలో కలిపి మీ శరీరానికి పట్టించాలి. పదినిమిషాల తర్వాత స్నానం చేయాలి.
గంధం పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి, దానిలో నాలుగు నుండి ఐదు చుక్కల పాలు కలిపి మీ ముఖానికి, శరీరానికి పట్టించండి. 15నిమిషాలు ఆగిన తర్వాత వేడినీటితో స్నానం చేస్తే చర్మం మృదువ్ఞగా ఉంటుంది.