మేని ఛాయకోసం ఫలసిరి

మేని ఛాయకోసం ఫలసిరి

చక్కటి పట్టులాంటి చర్మాన్ని కోరుకోనివారె వరుంటారు. చర్మ సౌందర్యానికి చిరునామాగా నిలవాలంటే కాసింత శ్రద్ధపెట్టాలి మరి. ఎక్కడో బ్యూటీ పార్లర్లలో గంటల తరబడి కూర్చుంటే వచ్చే సౌందర్యం మాటేమోగాని చర్మాన్ని వివిధ సమస్యల బారిన పడకుండా రక్షిస్తూ, చక్కటి ఛాయను ఇచ్చేవి మనచుట్టూనే మనకు అందు బాటులో చాలా ఉన్నాయి.

అవేంటో తెలుసు కుంటే ఇక ఎక్కడకూ పరుగులు తీయనవసరం లేదు. ఇంతకూ గొప్పవిషయం ఏమిటంటే ఇందులో కొన్ని మీకు చక్కటి రుచులను పంచుతూనే మీ చర్మానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ పట్టులాంటి మెరుపును, నునుపును మీ సొంతం చేస్తాయి. అవే ఇవి- వేప ఆకు ఉపయోగాలు: వేపాకును మించిన ఔషధమేదీ లేదని మనంతరచూ వింటూనే ఉంటాం. అయితే ఇదిచర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడు తుందన్న విషయం చాలామందికి తెలియక పోవచ్చు.

దీనిలో ఉండే యాంటిసెప్టిక్‌ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది.

స్ట్రాబెర్రీ ఉపయోగాలు:
విటమిన్‌-సి, సొలిసిలిక్‌ యాసిడ్‌లను కలిగి ఉన్న Zసాబెర్రీ పండ్లు చర్మం పైపొరను ఎంతో సురక్షితంగా కాపాడటమే కాకుండా ఎముకలకు ఎంతో శక్తిని ఇచ్చి, పెళుసుదనాన్ని పోగొడతాయి.ఈపండ్లు ఎలాంటి చర్మం కలవారికైనా ఉపయోగకరంగానే ఉంటాయి. ముఖ్యంగా చెమటకాయలు ఎక్కువగా ఉన్నవారికి, ఎలర్జీలు చర్మవ్యాధులతో తరచుగా బాధపడే వారి చర్మంపై ఇవి ఎంత గానో ప్రభావాన్ని చూపిస్తూ సురక్షితంగా ఉంచుతాయి. టమోటా ఉపయోగాలు: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లికోపెని చర్మంలో తేమను సమానస్థాయిలో కాపాడు తుంది.

అతి సన్నని చర్మరంధ్రాలను పరిశుభ్రపరచి ముఖచర్మానికి పట్టులాంటి అందాన్నిస్తుంది. టమోటారసం, నిమ్మరసం, గ్లిజరిన్‌ మూడు సమపాళ్లలో తీసుకుని ముఖానికి పట్టించి కొంచెం సమయం తరువాత కడుక్కుంటే ముఖం ప్రకాశవంతమౌతుంది. దానిమ్మపండు ఉపయోగాలు: ఇందులో ఎక్కువగా ఎల్లజిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది అన్నిరకాల పళ్ల లోకి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు కలిగినది. అందువలన ఇది చర్మం ముడుతలు పడకుండా ఉంచటంలో ప్రధానపాత్రను పోషిస్తుం ది. ముడుతలు పడే చర్మాన్ని చూసి చింతించేవారు ఇక ఆలస్యంచేయకుండా దానిమ్మను ఆశ్రయించాల్సి ందే మరి.పగుళ్లు, చర్మం పొడిబారి పోవటంవంటి లక్షణాల నుండి విముక్తిని కలిగి స్తుంది. ముఖ్యంగా అZలా వైలట్‌ కిరణాల తాకిడివలన దెబ్బతిన్న చర్మానికి ఎంతగానో ఉపకరిస్తుంది.