మేధ‌స్సు గ‌ల భార‌తీయుల‌కు రెడ్ కార్పెట్‌

EDGARD KAGAN
EDGARD KAGAN

వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నప్పటికీ ప్రతిభావంతులైన భారతీయులను అమెరికా ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుందని ముంబైలోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గార్డ్‌ కాగాన్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో అమెరికా సత్సంబంధాలను కోరుకుంటున్నది. మా దేశం ఎల్లప్పుడూ ప్రతిభావంతులైన భారతీయులను ఆహ్వానిస్తూనే ఉంటుంది అని చెప్పారు. దౌత్యపరంగా, వాణిజ్య పరంగా భారత్‌తో సత్సంబంధాలను కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రాధాన్యమిస్తున్నారని ఎడ్గార్డ్‌ కాగన్‌ తెలిపారు.