మేధాశక్తిని బట్టి తగిన స్కూల్లో చేర్పించండి

మనస్విని

(ప్రతి శనివారం)

Mother Teaching
Mother Teaching

This slideshow requires JavaScript.

మేధాశక్తిని బట్టి తగిన స్కూల్లో చేర్పించండి

నమస్కారం మేడమ్‌, నా పేరు భవ్య. మా అబ్బాయి ఏడవ తరగతి చదువ్ఞతున్నాడు. చాలా చురుకుగా ఉంటాడు. కాకపోతే చదువ్ఞలో చాలా వెనుకబడి ఉన్నాడు. ప్రతి సబ్జెక్టులోను ఫెయిల్‌ అయ్యాడు. చదువ్ఞలో అస్సలు శ్రద్ధ పెట్టడు. దగ్గర ఉండి అన్ని పాఠాలు చదివించి, అప్పచెప్పించుకుంటాను. అయినా కొద్దిసేపటికి మర్చిపోతుంటాడు. ఇప్పుడు స్కూల్‌కు వెళ్లనని మొరాయిస్తున్నాడు. చదవనని మొండికేస్తున్నాడు. బాబు భవిష్యత్‌ ఎలా ఉంటుందో అని బెంగగా ఉంది. దయచేసి మా బాబుకు చదువ్ఞపట్ల శ్రద్ధ కలగాలి అంటే తల్లిగా నేను ఏమి చేయాలి? ఎటువంటి సూచనలు పాటించాలో తెలియచేయగలరని ఆశిస్తున్నాను.- భవ్య, సైనిక్‌పురి

మీరు ముందుగా ఆందోళన నుండి బయటపడాలి. మీరు శ్రద్ధ వహించి, మీ బాబుని నిపుణులకు చూపించండి. వారు ఐక్యూ పరీక్షలు నిర్వహించి, బాబు మేధాశక్తిని అంచనావేస్తారు. అప్పుడు మేధాశక్తిని బట్టి తగిన స్కూల్లో చేర్పించండి. అలాకాకపోతే వేరే కారణాలు తెలుసుకోండి. కారణం తెలిస్తే, తగు చర్యలు తీసుకోవచ్చు. చదువులో వెనకబాటు తనానికి ఒక బలమైన కారణం ఉంటుంది. దానిని వృత్తి నిపుణుల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకొని తగు పాఠశాలలో చేర్పించాలి. అప్పుడు తప్పక మీ బాబు వృద్ధిలోనికి వస్తాడు. దీనిపై చింతించనవసరం లేదు. పిల్లవాడికి చదువ్ఞ మీద ఆసక్తి, ఉత్సాహం ఉండేలా మీరు చేయాలి. ఆసక్తి ఉంటే, ఏ విద్యలోనైనా రాణిస్తారు. ఇందులో సందేహం లేదు. పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా చదువ్ఞ నేర్పించాలి. టీచర్స్‌ బాగుండాలి. స్కూల్లో పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. అనుబంధాలు, ఆప్యాయతలతో పిల్లలకు చదువ్ఞ నేర్పించాలి. అప్పుడు పిల్లలు తప్పక అభివృద్ధిలోనికి వస్తారు. అలా కాకుండా దండిస్తే, పిల్లలు మొండిగా తయారవుతారు. అందువల్ల జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి.

వ్యతిరేక ఆలోచనలతో ఇబ్బంది

నమస్కారం మేడమ్‌. నా పేరు శ్రీదేవి. నా వయసు 50 సంవత్సరాలు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మానేసాను. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. నాకు ఎక్కువగా వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయి. నాకు ఎవరో హాని చేయడానికి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇటువంటి ఆలోచనల నుండి బయట పడదామని ఎంత ప్రయత్నించినా నాకు సాధ్యం కావడం లేదు. భయంతో రాత్రిళ్లు సరిగా నిద్రపట్టడం లేదు. నేను ఏది మాట్లాడినా నన్ను వింతగా చూస్తున్నారు. దయచేసి నా సమస్యను అర్ధం చేసుకొని, ఈ ్యతిరేక ఆలోచనల నుండి బయటపడే మార్గం తెలియచేయగలరని కోరుకొంటున్నాను. – శ్రీదేవి, హైదర్‌గూడ

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయటపడగలరు. మీరు తప్పక కౌన్సిలర్‌ని కలవాలి. మీఈ పరిస్థితికి గల కారణాలు తెలియాలి. అప్పుడు తప్పక సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఏ కారణం వల్లనైతే, ఈ సమస్య వచ్చిందో తెలిస్తే, తగు నివారణ చర్యలు, తగు చికిత్సలు చేయించుకుంటే, ఈ పరిస్థితి నుండి బయట పడవచ్చు. ఇది కుంగుబాటుగా తెలుస్తోంది. కుంగుబాటు లక్షణాలు ఇలానే ఉండవచ్చు. అందువల్ల, వెంటనే శ్రద్ధ వహించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులను సంప్రదించాలి. అప్పుడు తప్పక వెంటనే ఉపశమనం వస్తుంది. ఇందులో సందేహం లేదు. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. నిర్లక్ష్యం చేస్తే, సమస్యలు తీవ్రమవ్ఞతాయి. అందువల్ల వెంటనే తగు చర్యలు తీసుకోండి. ఉపశమనం కలుగుతుంది. జీవితం అమూల్యమైన కానుక. చక్కగా, ఆనందంగా స్వీకరించాలి. వ్యతిరేక ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకూడదు. ఒత్తిడిని కుంగుబాటును దగ్గరకు రానీయకూడదు. ఇష్టమైన పనులు చేస్తూ, సానుకూలంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఇదంతా ప్రయ్త్న పూర్వకంగా జరగాలి. ఎట్టి పరిస్థితులోనూ కుంగుబాటుకి, ఒత్తిడికి లోనుకారాదు. ఆనందంగా జీవించాలి. ఇది తప్పనిసరి. ్పు ందంగా జీవించాలి. ఇది తప్పనిసరి.

– డాక్టర్‌ శారద, సైకాలజీ ప్రొఫెసర్‌