మేడారానికి డిజిపి మహేందర్రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి: డిజిపి మహేందర్రెడ్డి గురువారం మేడారం చేరుకున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతోంది. జాతరకు భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి బందోబస్తు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నది పరిశీలించారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్న ఆయనకు ఎస్పీ భాస్కరన్, ఇంఛార్జ్ కలెక్టర్ కణ్ణన్, తదితరులు స్వాగతం పలికారు.