మేడారం జాత‌ర‌పై ఈరోజు క‌డియం శ్రీహ‌రి స‌మీక్ష

medaram
medaram

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క మేడారం జాతరపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే మేడారం జాతర జనవరి 31వతేదీ నుంచి ఫిబ్రవరి 3వతేదీ వరకు జరుగుతుంది. అయితే… జాతరకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉండడంతో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై డిప్యూటీ సీఎం కడియం సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే మేడారంలో కోట్లాది రూపాయలతో ఆయా పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై ఈ సమీక్షలో చ‌ర్చిస్తారు.