మేఘాలయా గని కార్మికుల హెల్మెట్లు లభ్యం

meghalaya coal mine
meghalaya coal mine

షిల్లాంగ్‌: మేఘాలయా ర్యాట్‌హోల్‌ బొగ్గు గనిలో 13 మంది కార్మికులు చిక్కుకున్నారు, వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే ఈరోజు ఉదయం రెస్క్యూ టిమ్‌ అధికారులు వారి హెల్మెట్లను వెలికి తీశారు. బహుశా ఆ ముగ్గురు కార్మికులు మృతిచెంది ఉంటార‌ని అంచనా వేస్తున్నారు. మ‌రోవైపు గ‌నిలో పేరుకుపోయిన నీటిని తోడేందుకు తీసుకువ‌చ్చిన హై ప్రెజ‌ర్ పంపులు ఇవాళ సాయంత్రం గ‌ని ప్రాంతానికి చేరుకోనున్నాయి. విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి 15 మంది నేవీ డైవ‌ర్లు కూడా మేఘాల‌యాకు చేరుకున్నారు. అక్ర‌మంగా గ‌ని తొవ్వారు కాబట్టి, దానికి సంబంధించిన మ్యాప్ అందుబాటులో లేదు. దీంతో రెస్క్యూ ఆప‌రేష‌న్ ఆల‌స్యం జ‌రుగుతోంది.  వారంతా ఆ గ‌నిలో ఉండి 18 రోజులు అవుతున్న‌ది.