మెహెందీ మరకలు మాయం

MEHANDI-2
MEHANDI-2

మెహెందీ మరకలు మాయం

విందులు..వేడుకలు సందర్భమేదైనా మెహెందీ మెరుపులు తప్పనిసరిగా ఉం డాలి. మరి ఆ సమయంలో అను కోకుండా మెహెందీ మరకలు దుస్తులమీద పెడితే ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. వాటిని తొలగిం చాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ్య దుస్తులకు గోరింట మరకలు అంటగానే వెంటనే నీళ్లలో తడిపి రుద్దితే మిగతా ప్రాంతంలో కూడా అంటుకు పోతుంది. అలా చేయకుండా మరకలు పడగానే అలా వదిలేసి జాగ్రత్తగా ఉతకాలి. ్య అలానే మామూలు వాటితో కలిపి వాషింగ్‌మెషీన్‌లోనూ వేయకూడదు. మరకపడి న ప్రాంతంలో నీళ్లు చల్లి సబ్బు రాసి పాత టూత్‌బ్రష్‌తో రుద్దితే ఫలితం కనిపిస్తుంది. ్య అలానే పాలను వేడిచేసి వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని అందులో మెహెందీ అంటి న వస్త్రాన్ని ఉంచాలి. అరగంటయ్యాక బయట కు తీసి సబ్బుతో రుద్ది ఉతికేస్తే అది సులువ్ఞగా తొలగిపోతుంది.