మెరుపు దాడులు తప్పలేదు

modi
modi

ఇంటర్వ్యూలో ప్రధానిమోడీ
న్యూఢిల్లీ: మెరుపుదాడులు నిర్వహించడం అతిపెద్దప్రమాదకరమైన కార్యాచరణ అని దాడులకంటేముందు తాను భారత సైన్యం భద్రతపైనే ఎక్కువ ఆందోళన కలిగించిందని ప్రధానిమోడీ పేర్కొన్నారు. ఊరిలో జరిగిన దాడిపై ప్రధానిమోడీ మాట్లాడుతూ ఈ సంఘటన తనకు నిద్రలేకుండాచేసిందని, అప్పటినుంచే సరైన జవాబు చెప్పాలని తన మనసు పదేపదే హెచ్చరించిందని అన్నారు. కొత్త సంవత్సంలో మోడీ మొట్టమొదటి పత్రికా ఇంటర్వ్యూలోమాట్లాడుతూ సూర్యుడు ఉదయించే ముందే తిరిగి వచ్చేయాలని, విజయం ఉన్నా విఫలం అయినా సూర్యోదయానికి ముందే రావాలని తన లక్ష్యంగా ఉండేదన్నారు. వాస్తవాధీనరేఖ ఆవలివైపునకు వెళ్లిన సైనిక కమాండోలకు ప్రధాని మోడీ ఇదే విధంగా చెప్పారన్నారు. 2016 సెప్టెంబరు 28వ తేదీ పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌వెంబడి ఉన్న ఉగ్రస్థావరాలను నిర్మూలించేందుకు చేపట్టిన మెరుపుదాడుల అసలు ఆలోచనలను మోడీ తన ఇంటర్వ్యూలో స్పష్టంచేసారు. మెరుపుదాడుల తేదీలను రెండుసార్లు మార్చామని, సెక్యూరిటీ బలగాల రక్షణ,భద్రతను పరిగణనలోనికి తీసుకునే అలాచేసామన్నారు. యూరిలోను, కాశ్మీర్‌లోను ఉగ్రదాడులు జరిగి 20 మంది సైనికులను మట్టుపెట్టిన సంఘటనన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ దాడులపై తనకు రానురాను సహనంకోల్పోయే పరిస్థితి వచ్చిందని, దేశభద్రతనే దృష్టిలో ఉంచుకుని మెరుపుదాడులకు ఉపక్రమించామన్నారు.ఊరిలోజరిగిన దాడిలోనే మన సైన్యానికి చెందిన జవాన్లను సజీవంగా దహనంచేయడాన్ని జీర్ణిఇంచుకోలేనిపరిస్థితి తలెత్తిందన్నారు. విజయం ఉన్నా, విఫలం అయినా సూర్యోదయానికి ముందే వచ్చేయాలని కోరానన్నారు. దాడులను పొడిగించవద్దని పదేపదే స్పష్టంచేసానన్నారు. దాడుల్లోమనసైనికులు ఒక్కరూ చనిపోలేదని, అందువల్లనే తాను సూర్యోదయానికి ముందే రావాలని కోరానన్నారు. రాత్రిమొత్తంగా ఈ సంక్లిష్ట ఆపరేషన్‌పై ఆలోచిస్తూనేఉన్నానని, దాడులపై ప్రత్యక్ష ప్రసారసమాచారిన్న ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని చెప్పారు. అది ఎంతో కష్టమనితనకు తెలుసునని, తాను ఆసమయంలో రాజకీయంగా తనకు ఎలాంటి కష్టం వచ్చినా లెక్కచేయకూడదని భావించానన్నారు. మన సైనికుల భద్రతేతనకు ముఖ్యమని తోచిందని పేర్కొన్నారు. మనమాటమీద వెళ్లిన మన కమాండోల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని ముందుగానే ధృఢసంకల్పంతో ఉన్నానని అన్నారు. కమాండోలు ఆపరేషన్‌కూడా అత్యం తజాగ్రత్తగా ఎంచుకున్నారని, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పారు. వారికి ఏ అధునాతన సామగ్రికావాలన్నా ఏర్పాటుచేసామని చెప్పారు. సైనికులు ఆవలివైపునకు వెళ్లినప్పటినుంచిఎంతో ఉత్కంఠతో గడిపామని వాస్తవాధీనరేఖ వెంబడి ఉన్న కదలికలను ఎప్పటికప్పుడు గమనించామని, ఇది అత్యంత సంక్లిష్టమైన కార్యాచరణ అనిఅయినప్పటికీ మన సైనికులు అనితరసాధ్యమైన రీతిలో పూర్తిచేసారన్నారు. సూర్యోదయానికి ఒక గంటముందు ఆపరేషన్‌నిలిపివేసినట్లు సమాచారం అందుకుని ఊపిరి పీల్చుకున్నట్లువెల్లడించారు. మెరుపుదాడులను ప్రభుత్వం రాజకీయం చేయలేదని, అది ప్రతిపక్ష పార్టీలుచేసాయని అన్నారు. అంతకుముందు మెరుపుదాడులు జరిగి ఉంటే పాకిస్తాన్‌ప్రభుత్వం ప్రకటించి ఉండేదని ఆయన అన్నారు. ఒక ఆర్మీ అధికారి ఈ ఆపరేషన్‌ను దేశానికి వివరించారన్నారు. ఇదే సమాచారం పాకిస్తాన్‌కుసైతం ఇచ్చామన్నారు. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే అదేరోజు కొందరుప్రతిపక్ష పార్టీలకు సంబంధించిననేతలు మెరుపుదాడులపై సందేహాలు వ్యక్తంచేసారన్నారు. పాకిస్తాన్‌కు ఈతరహాలో స్పందించాల్సిన అవసరం ఉందని, పాకిస్తాన్‌ ఏం చెపుతుందో భారత్‌లోని ప్రతిపక్షాలు సైతం అదే చెపుతున్నాయని ఆయన అన్నారు. పాకిస్తానీ వాదననే ప్రతిపక్షాలు సమర్ధిస్తున్నట్లు తెలుస్తోందని రాజకీయం చేయడం తగదని మోడీ స్పష్టంచేసారు. ప్రతిపక్ష నేతలు అర్ధరహితంగా మాట్లాడుతున్నారని, ఎవరైతే సైనిక చర్యను సందేహించారో వారంతా మన సైనికులను అవమానించినట్లేనని అన్నారు. 1962 యుద్ధంనుంచి ఇప్పటివరకూ మన సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఇది భారతప్రభుత్వ విధి అని ఆయన పేర్కొన్నారు. మనం సైనికత్యాగాలను విస్మరిస్తే ఇక ఎవరు వారిత్యాగాలను శ్లాఘిస్తారని ప్రశ్నించారు. మెరుపుదాడులతో పలితాలు సాధించామా లక్షఆయలు చేరుకున్నామా అంటే ఇప్పటికీ వాస్తవాధీనరేఖ వెంబడి దారుడు జరుగుతూనే ఉన్నాయన్నారు. కాశ్మీర్‌సమస్యను సరిహద్దు సమస్యలను బహిరంగంగా చర్చించబోనని మోడీ పేర్కొన్నారు. ఈచర్య తర్వాత పాకిస్తాన్‌ స్పందించేందుక సుదీర్ఘ వ్యవధి తీసుకుంటుందని, ఇపుడిపుడే కోలుకోలేదని ఆయన అన్నారు. ఊరి దాడిపైమోడీ మాట్లాడుతూ ఈ సంఘటన తనను కలిచివేసిందని, అప్పటినుంచే భారత్‌పరంగా గుణపాఠం చెప్పాలని తలపోసానని కేరళకు వెళ్లానని ఆయన అన్నారు. మెరుపుదాడుల నిర్వహణకుగాను సైన్యానికి స్వేఛ్ఛ ఇచ్చామని అందుకే విజయం సాధించామని అన్నారు. కమాండోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇదొక అనుభవమని మోడీపేర్కొన్నారు. ఊరిలోని సైనిక స్థావరంలోనికి జైషేమొహ్మద్‌ ఉగ్రవాదులుప్రవేశించారని, వాస్తవాధీన రేఖవెంబడి 20 మంది సైనికులపై దాడిచేసి చంపారని ఆయన అన్నారు. ఇందుకుప్రతీకారంగానే మనసైనికకమాండోలు ప్రత్యేక శక్తుల గ్రూపులు జమ్ముకాశ్మీర్‌లో నియమించి ప్రత్యేకదాడులకు ఆదేశాలిచ్చామన్నారు. జమ్ముకాశ్మీర్‌లోనికి వచ్చే ఉగ్రవాదులనే లక్ష్యంగాచేసుకుని ఈదాడులు జరిగాయన్నారు. సైనిక దళాలకు ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా సంఖ్యాపరంగా తెలియనప్పటికీ పాకిస్తాన్‌వైపున సుమారు 50మందికిపైగా చనిపోయి ఉంటారన్న సమాచారం ఉందని తెలిపారు. పాకిస్తాన్‌సైన్యంతోపాటు ఉగ్రవాదులు కూడా చనిపోయినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. భారత్‌వైపునుంచి కేవలం ఒకే ఒక్క సైనికుడు గాయాలుపాలయ్యాడని, అదికూడా మందుపాతర పేలడం వల్లనేనని, ఆపేలుడు కూడా మొత్తం ఆపరేషన్‌పూర్తయి తిరిగిస్తున్నపుడు జరిగిందని ప్రధానిమోడీ వివరించారు.