మెరుపు తీగెలా..

KAREENAKAPOOR
KAREENAKAPOOR

మెరుపు తీగెలా..

కరీనా కపూర్‌.. సైఫ్‌తో పెళ్లయినా కూడ అదే ఫిగర్‌ మెయింటెన్‌ చేసింది. తైమూర్‌కు జన్మనిచ్చాక మాత్రం బొద్దుగా మారింది.. మళ్లీ మెరుపుతీగెల మాటానికి చాలా కష్టపడింది.. ఈ ఫొటో చూస్తే ఆ కష్టం ఫలించినట్టే ఉందని అంటున్నారు. హాలీవుడ్‌ మెరుపు తారలా సన్నగా గ్లామరస్‌గా తయారైంది.. మళ్లీ జోరుగా సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ సెలెబ్రిటీ డైటీషియన్‌సమత్రా పురోహిత్‌ ఆధ్వర్యంలో కఠినమైన డైట్‌పాటిస్తూ కొవ్వును కరిగించేసుకుందట.. ఇంత కష్టపడింది కనుకగా ఆమె ఇపుడు సన్నజాజి తీగలా కన్పిస్తోందనిఅంటున్నారు. కాగా తైమూర్‌ పుట్టిన తర్వాత కరీనా.. శషాంక్‌ ఘోష్‌ దర్శకత్వంలో ‘ వీరే ది వెడ్డింగ్‌ సినిమాతోరీ ఎంట్రీ ఇస్తోంది. ఈసినిమా వచ్చే జూన్‌ 1న విడుదల కానుంది.. కాగా ఈసినిమాలో కరీనాతోపాటు సోనమ్‌కపూర్‌ స్వర భాస్కర్‌ షికా తల్సానియా కూడ నటిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించి పోస్టర్‌ ఒకటి బయటకు వచ్చింది. అందులో కరీనా లుక్‌ అదిరిపోయింది..