మెద‌క్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం

passport
passport

మెద‌క్ః  జిల్లా కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమయింది. పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్.. మెదక్ వాసులు పాస్‌పోర్ట్ సేవలను అత్యంత సులభంగా ఇక్కడే పొందొచ్చని తెలిపారు. పాస్‌పోర్ట్ సేవల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేందుకే మెదక్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.