మెడిక‌ల్ కాలేజి హామీ అట‌కెక్కించారుః పొన్నం

ponnam prabhaker
ponnam prabhaker

కరీంనగర్: సింగరేణి ఓట్ల కోసం కేసిఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కారుణ్య నియామకాలు సాధ్యం కాదని తెలిసినా కేసిఆర్‌ ఓట్ల కోసం అబద్దాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లయినా సింగరేణి మెడికల్ కాలేజీ హామీ అట‌కెక్కించార‌ని విమర్శించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం ఒక్కపైసా ఖర్చు చేయలేదని చెప్పారు. సింగరేణి కార్మికులు టీఆర్‌ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలని పొన్నం వ్యాఖ్యానించారు.