మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ, గవర్నర్, సీఎం కేసీఆర్

Modi, kcr, ktr in Metro journey
Modi, kcr, ktr in Metro journey

మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ, గవర్నర్, సీఎం కేసీఆర్

మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం మియాపూర్ స్టేషన్ నుంచి కూకట్ పల్లి స్టేషన్ వరకు ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణించిన వారిలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు ఉన్నారు.

మెట్రో రైళ్లను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ చిత్రాలతో పాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలు, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, చార్మినార్, గోల్కొండ వంటి చిత్రాలతో అందంగా ముస్తాబు చేశారు.