మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Hyd Metro
Hyd Metro

హైదరాబాద్‌: మెట్రో ప్రయాణం వేగంగా సాగుతోంది. మెట్రో కారిడార్‌1 (మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 29 కి.మీ) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో మెట్రో రైళ్లలో వేగం పుంజుకుంది. వంపులు తక్కువగా ఉండడం, కమ్యూనికేషన్‌ బేస్ట్‌ ట్రైయిన్‌ కంట్రోల్‌ (సీబీటీసీ) వ్యవస్థను వినియోగించేందుకు అనుకూలంగా ఉండడంతో మెట్రో రైళ్లను వేగంగా నడుపుతున్నారు. రద్దీ బట్టిని ప్రతి 3.5 నిమిషాలకో మెట్రో రైలు నడిపేలా ప్రణాళికను సిద్ధం చేశారు. మున్ముందు అవసరమైతే 90 సెకన్లకు ఒక రైలును సైతం నడిపేందుకు సీబీటీసీ వ్యవస్థతో సాధ్యమవుతుందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. మెట్రో ప్రారంభంలో కొన్ని నెలల పాటు 815 నిమిషాల వ్యవధిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత సమయాన్ని 6.5 నిమిషాలకు తగ్గించారు. సెప్టెంబర్‌ 24 తర్వాత కారిడార్‌1లో 5 నుంచి 3.5 నిమిషాల వ్యవధిలోనే మెట్రో రైళ్లు స్టేషన్లకు వచ్చేస్తున్నాయి. గతంకంటే ప్రస్తుతం మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగడంతో ప్రయాణికులు మెట్రో బాట పడుతున్నారు.