మెట్రో ఉద్యోగాలన్నీ తెలంగాణకే దక్కాలి :జీవన్‌రెడ్డి

Jeevan reddy
Jeevan reddy

హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగాలన్నీ తెలంగాణ యువతకే దక్కాలని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. కాగా, నేడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఉద్యోగం పోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఉద్యోగాలన్నీ భర్తీ చేయకుంటే ఓట్లు అడిగే హక్కు ఉండదని, తెలంగాణ వచ్చాక 8వేల పరిశ్రమలు మూత పడ్డాయని చెప్పారు. కోదండరామ్‌ ఉద్యమానికి కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు జీవన్‌రెడ్డి.