భద్రతా సిబ్బందికి శిక్షణకు మొబైల్‌ ట్రైనింగ్‌వ్యాన్‌

n v s reddy
n v s reddy

హైదరాబాద్‌: భద్రతా సిబ్బందికి అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చేందుకు మెట్రోరైలు భవన్‌ ప్రాంగాణంలో మొభైల్‌ ట్రైనింగ్‌వ్యాన్‌ను ఆదివారం మెట్రోఎండీ ఎన్‌విఎన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వ్యాన్‌లో స్టేషన్లలో, మెట్రో ఇతర పరివాహక ప్రాంతాలలో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారి భద్రతా సిబ్బందికి ఉద్యోగ శిక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం ట్రాన్స్ఫార్మల్‌ లీప్‌ అన్ని మెట్రోఎండీ అభివర్ణించారు. ఈసందర్భంగా మెట్రోఎండి మాట్లాడుతూ…మెట్రోస్టేషన్లలో పనిచేస్తున్న అన్నివిభాగాల్లోని భద్రతా సిబ్బందికి ఎమ్‌ ట్రైనర్‌ వాన్‌ ద్వారా కాలానుగుణంగా రక్షణా శిక్షణను నిర్వహించడానికి టివిసెట్స్‌, సిసికెమెరా, అగ్నిప్రమాదాలు వంటి విపత్తులు ఎదుర్కొవడానికి ఎలక్ట్రికల్‌ గాడ్జెట్లు, వీటితో పాటు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించడానికి హెచ్‌ఎమ్‌ఆర్‌ కమిషనర్‌ ఎ బాలకృష్ణలు అందుబాటులో ఉంచమని తెలిపారు. ఆడియో-వీడియో ఫిల్మ్‌, పిపిటి పోస్టర్లు, బోర్డులు, హ్యాండ్‌బుక్స్‌తదితరాలు కూడా ఈ శిక్షణలో తెలుపుతారు. ఈ వ్యాన్‌లో శిక్షణను ఇవ్వడం మొత్తం నేషనల్‌ కమాండ్‌లో కంట్రోల్‌కు అనుసంధానమై ఉంటుంది. అదే విధంగా హర్ట్‌డిస్కు జీపిఆర్‌ఎస్‌ తాజా టెక్నాలజీ ద్వారా ఎనేబుల్‌ చేయబడిందని, తద్వార రక్షణ వ్యవస్థను కంట్రోల్‌ చేసే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మెట్రోస్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్‌, భద్రతా సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌ మెట్రోస్టేషన్లలో సుమారు 900 మంది భద్రతా సిబ్బంది మూడు షిప్టులలో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇప్పటి వరకు ప్రతి ఉద్యోగి నిబద్దతతో పనిచేశారని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా మెట్రోస్టేషన్లు, అనుభంద ప్రాంతాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక చొరవతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డివిఎస్‌ రాజు, లక్ష్మణ్‌, ఆనంద్‌మోహన్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, బిఎన్‌ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.