‘మెట్రోకి ప్రేక్షకాదరణ!

METRO Success Meet
Suresh Kondeti in METRO Success Mee

‘మెట్రో’కి ప్రేక్షకాదరణ!

ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సురేష్‌ కొండేటి సమర్పణలో రజనీ తాళ్లూరి నిర్మించిన మెట్రో చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా ఆడుతోంది. చైన్‌ స్నాచింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులకు బ్రహ్మరధం పడుతున్నారు. హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో థియేటర్లలలో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌ లో ఆదివారం సక్సెస్‌ మీట్‌ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సురేష్‌ కొండేటి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆదరిస్తున్నారు. సినిమాలో అంతా కొత్త వాళ్లైనా ఇంత ఆదరణ లభిస్తుందంటే కారణం అందులో ఉన్న కంటెట్‌ వలనే. మంచి కథాంశం ఉన్న చిత్రాలు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నా విషయంలో ప్రూవ్‌ అయింది అని అన్నారు.
చిత్ర దర్శకుడు ఆనంద్‌ కష్ణ మాట్లాడుతూ.. నా మొదటి సినిమానే తెలుగు, తమిళ్‌ లో పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. చైన్‌ స్నాచింగ్‌ వాస్తవ సంఘటలను బేస్‌ చేసుకుని కథ సిద్దం చేశా. మొదట్లో కొంచెం టెన్షన్‌ పడ్డా. కానీ అవుట్‌ ఫుట్‌ చూసుకుని సక్సెస్‌ అవుతానని కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ప్రస్తుతం ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీని రెడీ చేస్తున్నా. తెలుగులో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నా అని అన్నారు.
చిత్ర హీరో శిరష్‌ మాట్లాడుతూ.. హీరోగా నాకిది మొదటి సినిమా. యాక్టింగ్‌ కోర్స్‌ చేసి ఇటువైపు వచ్చా. ఆరంభంలోనే క్రైమ్‌ థ్రిల్లర్‌ లో నటించే అవకాశం వచ్చింది. తొలి సినిమానే రా మెటిరీయల్‌ సినిమా లో నటించడం మంచి ఎక్స్‌ పీరియన్స్‌ ను ఇచ్చింది. డైరెక్టర్‌ ఆ పాత్రను చాలా సెటిల్డ్‌ గా చేయించారు. ప్రస్తుతం రాజా రంగీత్‌ అనే సినిమా చేస్తున్నా. మంచి స్టోరీ అది. హ్యారీస్‌ జయరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాలుగు రోజులు షూటింగ్‌ మినాహా అంతా పూర్తయింది. ఏప్రిల్‌ 14న ఆ సినిమా ఫస్టు లుక్‌ రిలీజ్‌ చేస్తున్నాం. అదే నెలాఖరున సినిమా కూడా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం అని అన్నారు.