మెగా హీరోయిన్‌కుఅండగా మెగా స్టార్స్‌

vvvvv
మెగా హీరోయిన్‌కుఅండగా మెగా స్టార్స్‌
మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ‘ఒక మనసు. అనౌన్స్‌మెంట్‌ నుంచే మంచి అంచనాలను రేకెత్తించిన ఈసినిమా ఫస్ట్‌లుక్‌ అందరినీ కట్టిపడేసింది. ఓ మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈసినిమా షూటింగ్‌ పూర్తిచేసకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరపుకుంటోంది.. ఈనెల 27న సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. శిల్పకళావేదికలో జరిగే ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ స్టార హీరోల సందడి కన్పించనుందని సమాచారం.

NIYARISKA

 

మెగాస్టార్‌ చిరంజీవి , మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లతోపాటు మిగతా మెగా హీరోలంగా విచ్చేసి నిహారిక సినిమాకు సపోర్ట్‌గా నిలుస్తూ , ఆమెనుగ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారట. టివి9 తో కలిసి దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌ నిర్మిస్తోన్న ఈసినిమాకు మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వులాంటి అందరమైన సినిమా తీసిన రామరాజు దర్శకత్వం వహించారు.ఇక ఈనెల 27న జరిగే మెగా ఈవెంట్‌కు ఇప్పట్లుంచే టీమ్‌ సన్నాహాలు చేస్తోంది