మెగా హీరోతో జోడీ

ANUPAMA PARAMESWARAN-1
ANUPAMA PARAMESWARAN

మెగా హీరోతో జోడీ

మలయాళంలో ‘ప్రేమమ్‌ సినిమాతో బాక్సాఫీస్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న భామ అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పటి వరకు ఈ భామ నటించిన అన్నిసినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి.. ముఖ్యంగా ‘అఆ సినిమాలో చేసింది సైడ్‌ హీరోయిన్‌గా అయినా తనపాత్రకు న్యాయంచేసి అందరినీ ఆకట్టుకుంది.. ఇక తెలుగు ప్రేమమ్‌లో అలాగే శతమానం భవతి సినిమాతో హీరోలకు అదృష్టలక్ష్మి గా మారిపోయింది.
అయితే ఇపుడు ఈ అదృష్టలక్ష్మి మెగా హీరోకి జోడికట్టే ఛాన్స్‌ కొట్టేసింది.. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న లవ్‌స్టోరీలో సాయితో కలిసి రొమాన్స్‌ చేయటానికి సిద్ధమపోయింది.. ఈక్రేజీ కాంబినేషన్‌ను ప్రముఖ దర్శకుడు కరుణాకరన్‌ డైరెక్టుచేయబోతున్నారు.. లవ్‌స్టోరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కరుణాకరన్‌ సాయిని లవర్‌బా§్‌ుగా చూపించబోతున్నారు.. చాలా రోజుల నుంచి కరుణాకరన్‌కి సరైన హిట్‌ లేదు.. ఇక సాయి ధరమ్‌తేజ్‌తో కూడ మంచి బాక్ఫాఈస్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు..