మెగా మిలిటరీ డ్రిల్స్‌ నిర్వహిస్తున్న రష్యా

Drills
Drills

మాస్కో: రష్యా గతంలో ఎన్నడూలేనంతగా భారీ మిలిటరీ విన్యాసాలను నిర్వహిస్తోంది. వచ్చేనెలలోనే అతిపెద్ద డ్రిల్‌ నిర్వహించాలనినిర్ణయించింది. మొత్తం మూడు లక్షల మందిట్రూప్‌లు, వెయ్యివిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. 1980 తర్వాత అతిపెద్ద యుద్ధక్రీడా విన్యాసాలు రష్యా నిర్వహిస్తోంది.వోస్టోక్‌ 2018 కసరత్తులు సెప్టెంబరు 11 నుంచి 15వ తేదీవరకూ దేశంలోని తూర్పుప్రాంతంలో నిర్వహిస్తారు. చైనా, మంగోలియా దేశాలు సైతం ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. జాపడ్‌-81 తరహాలో ఈ విన్యాసాలు ఉంటాయని, వాటికంటే భారీస్థాయిలో ఉంటాయి సెర్గి షో§్‌ుగూ వెల్లడించారు. తూర్పు యూరోప్‌ప్రాంతంలో 1981 నాటి యుద్ధక్రీడల తరహాలోనే ఈ విన్యాసాలుంటాయి. మధ్యమండం, తూర్పు మిలిటరీ జిల్లాలకు చెందిన వెయ్యి విమానాలు, మూడులక్షలకుపైగా మిలిటరీ ట్రూప్లఉ పాల్గొంటాయి. మొత్తం 36వేలకుపైగా మిలతిటరీ యంత్రసామగ్రి ఈదిశగా వెళుతున్నాయి. యుద్ధ ట్యాంకులు, ఆయుధసామగ్రి సిబ్బంది వాహనాలు, యుద్ధవాహనాలు మొత్తం పాల్గొంటున్నట్లు రష్యా వెల్లడించింది. 2017 జపడ్‌ మిలిటరీ డ్రిల్స్‌ తన మిత్రదేశం బెలారస్‌లో నిర్వహించింది. కొన్ని రష్యా ప్రాంతాల్లో కూడా వీటిని నిర్వహించారు. సుమారు 12,700కుపైగాట్రూప్‌లు పాల్గొన్నాయి. అయితే నాటో దేశాలు రష్యా ఈ విన్యాసాలను తక్కువచేసి చూపిస్తోందని ఆరోపించాయి. తూర్పుప్రాంతంలోని కొందరు కూటమి దేశాల సభ్యులు లక్షకుపైగా సిబ్బందిని ఈ విన్యాసాల్లో నియమిస్తున్నట్లు నాటోదేశాలు రష్యాపై ఆరోపణలు చేస్తున్నాయి.