మెగా కిచెన్‌ను ప్రారంభించిన కడియం

సంగారెడ్డిః జిల్లాలోని కందిలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 20 కోట్లతో నిర్మించిన మెగా కిచెన్‌ను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇవాళ ప్రారంభించారు. పలు ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ అందిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే మెగా కిచెన్‌ను నిర్మించారు. మెగా కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తితో పాటు అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.