మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం !

CHIRU-2
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బయటికొచ్చిన ఈ వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా నిలిచింది. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ ఇంట్లో సర్వర్ గా పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి ఈరోజు రూ.2 లక్షల రూపాయల నగదును దొంగిలించాడట. విషయం తెలుసుకున్న చిరంజీవి తన మేనేజర్ గంగాధర్ ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సర్వర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన 151 వ సినిమా ‘సైరని నరసింహారెడ్డి’ పనుల్లో బిజీగా ఉండగా రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ షూట్లో ఉన్నారు.