మెక్సికో గల్ఫ్‌ తీరంలో పెరుగుతున్న పెట్రోల్‌ కాలుష్యం

PETROL POLLUTION1
PETROL POLLUTION1

మెక్సికో గల్ఫ్‌ తీరంలో
పెరుగుతున్న పెట్రోల్‌ కాలుష్యం

వాషింగ్టన్‌: గత 14 సంవత్స రాల నుంచి మెక్సికో గల్ఫ్‌ తీరంలో వృధాగా కలిసిపోతున్న లక్షలాది బ్యారళ్ల ఆయిల్‌ స్కిల్‌ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యర్ధంగా నమోదుకానుంది. 2004నుంచి లౌజీయానా తీరంలో 12మైళ్ల పొడవునా ప్రతి రోజు 300 నుంచి 700బ్యారళ్ల వరకు పెట్రోల్‌ లీక్‌అవు తోంది. టెయిలర్‌ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలోని ఆయిల్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి ఈ లీకేజీ గత 14 సంవత్సరాల నుంచి అలా జరుగుతూనే ఉంది. ఈ చమురు బావులను పూడ్చివేయడం గానీ, లేదా లీకేజీ కాకుండా అడ్డుకోవడం కానీ జరగడం లేదు. దీని వల్ల పెద్ద ఎత్తున పెట్రోల్‌ సముద్రజలాల్లో తేలియాడుతోంది. మున్ముందు కూడా ఈ లీకేజీలను అరికడతారని నమ్మకంలేదు. వాషింగ్టన్‌ పోస్ట్‌ ఇటీవల ప్రచురించిన ఒక వార్తలో ఈ అంశాన్ని పేర్కొంది. చాలామందికి ఇక్కడ సముద్రం ఉందని గానీ, దానిలో పెట్రోల్‌ వృధాగా తేలియాడుతుందని గానీ తెలియదు. ఆ కంపెనీ ఈ అంశాన్ని బయటిపొక్కకుండా దాస్తూ వచ్చింది. ఈ అంశాలు బయటికి వెల్లడిఅయితే తమ ప్రతిష్టకు ఎక్కడ భంగం కలుగుతుం దోనని రహస్యంగా దాస్తూ వచ్చిన సమాచారం ఆరు సంవత్సరాల కిందట లీక్‌ అయింది. గత నెల అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక విశ్లేషణ చేస్తూ నానాటికి ఈ లీకేజీ పెరుగుతుందని, సగటున ప్రతి సంవత్సరం 3.3లక్షల గ్యాలళ్ల పెట్రోల్‌ సముద్రంలో తేలియడుతుందని పేర్కొంది.