‘మెంటల్‌ మదిలో’ సక్సెస్‌ వేడుక

MENTAL MADILO  FUNCTION
MENTAL MADILO FUNCTION

ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘మెంటల్‌ మదిలో.. రాజ్‌ కందుకూరి నిర్మాత. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. డి.సురేష్‌బాబు ఈచిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ విష్ణు, నివేధా పెతురాజ్‌ జంటగా నటించిన ఈసినిమా నవంబర్‌ 24న విడుదలైంది. ఈసందర్భంగా ఈచిత్రం యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్‌ప్రవీణ్‌ సత్తార్‌, నందినిరెడ్డి , నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. యూనిట్‌ సభ్యులకు జ్ఞాపికలు బహూకరించారు. నిర్మాత మాట్లాడుతూ, సినిమా విడులైన తర్వాత రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయని ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. కార్యక్రమంలో శివాజీరాజా, ప్రవీణ్‌ సత్తార్‌, హీరో శ్రీవిష్ణు తదితరులు మాట్లాడారు. అనితాచౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ విహారి, సింగర్‌ రేవంత్‌, నటులు కిరీటి, అరుణ భిక్షు, భాస్కర్‌ భట్ల, సిరాజ్‌శ్రీలతో పాటు మెంటల్‌ మదిలో చిత్రం యూనిట్‌ మొత్తం ఈ వేడుకలో పాల్గొన్నారు.