మృత్యువాత ప‌డ్డ వారి కుటుంబాల‌కు ర‌ఘువీరా సానుభూతి

Raghuveera reddy
Raghuveera reddy

ప‌ల‌మ‌నేరుః చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో హెచరీస్ కంపెనీకి చెందిన డ్రైనేజీలోకి దిగి ఏడుగురు మృత్యువాత ప‌డ‌డంపై ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న విజ‌య‌వాడ‌ ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున‌ పరిహారం చెల్లించాల‌ని డిమాండ్ రఘువీరారెడ్డి చేశారు. కాగా, పౌల్ట్రీ ఉత్పత్తుల పరిశ్రమను నిర్వహిస్తూ, వెంకీస్, వెన్ కాబ్ వంటి పలు బ్రాండ్లను మార్కెటింగ్ చేస్తోన్న వెంకటేశ్వర హేచరీస్ లో ఈ రోజు ఉద‌యం ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న తెలిసిందే.