మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా

Died
Died

విజయవాడ కృష్ణా న‌దిలో బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. మ‌రో రెండు మృత‌దేహాల కోసం ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వెతుకుతున్నారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌లు చొప్పున ప్ర‌భుత్వం ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. మ‌రోవైపు బోల్తా ప‌డిన ప‌డ‌వ‌ను ఒడ్డుకు తీసుకువ‌చ్చేందుకు సిబ్బంది చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చిన‌రాజ‌ప్ప , శిద్దా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. విజ‌య‌వాడ కొత్త ప్ర‌భుత్వాసుప‌త్రికి ఏడు మృత‌దేహాలు త‌ర‌లించారు. ముగ్గురు మ‌హిళ‌లు స‌హా ఏడుగురికి వైద్యులు పోస్టుమార్టం నిర్వ‌హిస్తున్నారు. మృతులు వెంక‌టేశ్వ‌ర్లు, కుమార్ , కుసుమ‌, సీతారామ‌య్య‌, ల‌లిత గా గుర్తింపు.