మూలాధారం ఆహారం

తెలుసుకోండి ..
                             మూలాధారం ఆహారం

FOOD
FOOD

మన శరీరం అనేక కణాలతో, ధాతువ్ఞలతో నిర్మితమైంది. శరీర నిర్మాణానికి ప్రాణాధారం ఆహారమే. ఆహారం తీసుకోవ డం మూలంగానే మనం జీవించగలగుతున్నామనేది నిజం. మన శరీర సమగ్రాభివృద్ధికి మూలాధారం ఆహారమే. శరీరం అంటే కేవలం మనకంటికి కనిపించే భౌతికమైన ఆకారం మాత్రమే కాదు. మంచి రూపం, కంఠస్వరం, దీర్ఘాయు ర్దాయం, వివేచన, మనస్సు, ఆలోచన, ఆనందం, సంతృప్తి, తెలివితేటలు, ఇవి అన్నీ శరీరంలో అంతర్భాగమే అంటాడు చరక సంహిత రచయిత. ఇవి అన్నీ ఆహారంలో ఉన్నాయి. దీని అర్ధం ఏమిటంటే మనిషి అంటే శరీరము, ఆలోచన (భౌతికం, మానసికం). ఈ రెండింటికీ మూలాధారం ఆహారమే. మనం తినే ఆహారంలో లోపం ఉన్నా, సమతుల్యత లేకపోయినా దాని ప్రభావం మన శరీరంపైన (మనస్పుపైన) ఉంటుంది. పర్యవసానమే శారీరక, మానసిక రోగాలు, అనారోగ్యం.

ఆ విధంగా మానసిక, శారీరక అనారోగ్యం ప్రాప్తించిన ప్పుడు, తిరిగి ఆహార చికిత్స ద్వారానే ఆ అనారోగ్యాన్ని పారద్రోలటం సాధ్యమవ్ఞతుంది. అంటే మానసికంగాను, శారీరకం గాను, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం కావాలి. శరీరం అనారోగ్యం పాలయినప్పుడు తిరిగి స్వస్థత చేకూరటానికీ ఆహారం కావాలి. అయితే, కొంచెం తేడా ఉన్నది. మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండేందుకు మనం తీసుకోవలసింది సమీకృత ఆహారం. అనారోగ్యకరమైన శరీరానికి స్వస్థత చేకూర్చే క్రమంలో మనకు కావలసింది ఆ అనారోగ్యాన్ని పారద్రోలటానికి అవసరమైన ప్రత్యేక ఆహారం.