మూతపడే ఇంజనీరింగ్ కాలేజీల వీలీనం దిశగా ఏఐసీటీఈ ప్రయత్నాలు!

ఢిల్లీః పలు కారణాల వల్ల మూతపడేందుకు సిద్ధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విషయంలో అఖిలభారత సాంకేతిక
విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రత్యామ్నాయాలను యోచిస్తోంది. ఇందులో భాగంగా దగ్గరదగ్గరగా ఉన్న కళాశాలలను
విలీనం చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. కళాశాలల కొనుగోలు ప్రతిపాదనకూ సుముఖంగానే ఉంది. దేశంలో ఇలాంటి
ఇంజనీరింగ్ కాలేజీలు 800 ఉన్నాయి. మూసివేత నిర్ణయాన్ని రెండేళ్లు వాయుదా వేయాలని లేదంటే విలీనానికి
అనుమతించాలంటూ ఆయా కళాశాలల యాజమాన్యాలు ఏఐసీటీఈని కోరాయి.