మూడో రోజుకు చేరిన మమత దీక్ష

Mamatha Benarjee
Mamatha Benarjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వైఖరికి నిరసనగాచేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట మమతా బెనర్జీ నిరసన కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి దీదీ దీక్ష చేస్తున్నారు. దీక్ష వేదిక నుంచే మమతా పరిపాలనా వ్యవహారాలను నడుపుతున్నారు. మరోవైపు దీదీకి మద్దతుగా బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అటు మమతా బెనర్జీ దీక్షకు మిత్రపక్షాల సంఘీభావం తెలిపాయి.