మూడో ట‌స్టులో కుప్ప‌కూలిన భార‌త్‌

South Africa 1
South Africa

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్‌ టప టపా వికెట్లు కోల్పోయింది. పుజారా(50), పార్దీవ్‌ పటేల్‌(2), హార్దిక్‌ పాండ్యా(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. తొలుత కెప్టెన్‌ కోహ్లి తరహాలోనే టీమిండియా నయావాల్‌ చతేశ్వర పుజారా హాఫ్‌ సెంచరీ అనంతరం క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వికెట్‌ కీపర్‌ పార్దీవ్‌ పటేల్‌(2) సైతం మోర్కెల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. పుజారా ఆండిల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆవెంటనే క్రీజులో వచ్చిన ఆల్‌రౌండర్‌ పాండ్యా భారీ షాట్‌కు ప్రయత్నించి డికాక్‌ చిక్కాడు. 144 పరుగుల వద్దే భారత్‌ మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. దీంతో భారత్‌ 144 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో భువనేశ్వర్‌(7), మహ్మద్‌ షమీ(5) ఉన్నారు.