మూడో టీ20 మ్యాచ్ లో భార‌త్ విజయం

india win
india win

ముంబైలో శ్రీ‌లంక వ‌ర్సెస్ భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న మూడో టీ20 మ్యాచ్ లో భార‌త్ జ‌ట్టు 5వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. గుణ‌ర‌త్నే36, స‌మ‌ర‌విక్ర‌మ 21 మిన‌హా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ నిల‌క‌డ‌గా రాణించ‌క‌లేక‌పోయారు.

డిక్ వెలా 1, కుశాల్ 4, త‌రంగ 11 , స‌మ‌ర‌విక్ర‌మ‌ 21, గుణ‌తిల‌క 3, పెరీరా 11 పరుగులు చేసి పెవిలియ‌న్ చేరారు. దీంతో ఆ జ‌ట్టు భార‌త్ ముందు 136 స్వ‌ల్ప టార్గెట్ ను మాత్ర‌మే ఉంచ‌గ‌లిగింది. భార‌త్ బౌల‌ర్ల‌లో ఉనాద్క‌ట్ రెండు వికెట్లు, పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సుంద‌ర్, కుల‌దీప్, సిరాజ్ లు చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ బ్యాట్స్ మెన్లు మనీష్ పాండే 32, శ్రేయస్ అయ్యర్ 30, రోహిత్ శర్మ 27, దినేష్ కార్తీక్ 18, ధోని 16 పరుగులు చేశారు. శ్రీ‌లంక బౌలర్లు చమీర, శనకలు చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీ‌లంక నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగా, భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి విజయం సాధించారు.