మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ!

గుజరాత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 28 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో విడత జాబితాను ప్రకటించింది. ఇటీవలే 70 మంది అభ్యర్థులతో తొలి జాబితా, 36 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 16 మంది కొత్తవారు సహా మరికొంతమంది ఉన్నారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 9, 14 వ తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.