మూడేళ్ల కనిష్టస్థాయికి నెట్‌ కంపెనీల నిధుల సమీకరణ

B6
Soft Ware

మూడేళ్ల కనిష్టస్థాయికి నెట్‌ కంపెనీల నిధుల సమీకరణ

న్యూఢిల్లీ, జనవరి 10: భారత్‌లోని ప్రైవేటు ఇంటర్నెట్‌ కంపెనీల నిధుల సమీ కరణ మూడేళ్ల కనిష్టస్థాయికి చేరింది. డిసెంబరుతో ముగిసిన చివరి త్రైమా సికంలో 300మిలియన్‌ డాలర్లు మాత్రమే సేకరించినట్లు జెఫరీస్‌ నివేదిక విశ్లేషిం చింది. ఇంటర్నెట్‌ కంపెనీల నిధుల సమీ కరణ మందగమనంతోనే ఉందని, డిసెం బరు త్రైమాసికంచూస్తే మూడేళ్ల కనిష్ట స్థాయిలో ఉందని, 2013 జూన్‌నాటి నిధు ల సమీకరణ గుర్తుకుతెచ్చిందని విశ్లేషిం చింది. 2015లో 5.8 బిలియన్‌ డాలర్లు సమీకరిస్తే 2016లో కేవలం 2.7 బిలియన్‌ డాలర్లు నిధులు మాత్రమే సెరించగలిగాయి. ఇ-టెయలింగ్‌ విభాగం ఎక్కువ వాటాతో ఉంది. 74శాతం వాటా ఈసంస్థలకే దక్కిం ది. రవాణారంగంపరంగా మేక్‌మైట్రిప్‌, ఐబిబో, యాత్రా డాట్‌కామ్‌లు నిధులు సమీకరించాయి

. బైజు, సోషల్‌నెట్‌వర్క్‌ హైక్‌ క్లాసిఫైడ్స్‌ కార్‌ట్రేడ్‌, ఫిన్‌టెక్‌ మొబిక్విక్‌ వంటివి నిధుల సేకరణలో కొంతముందున్నాయి. 2017 తీరుతెన్ను లు కూడా లాభదాయకత, పునరేకీకరణ ఆధారంగా నిధులు అందుబాటు లోనికి వస్తాయని జెఫెరీస్‌ అంచనావేసారు. భారత ఇంటర్నెట్‌రంగం గడచిన 12నెలల్లో వృద్ధిపథంగానే ఉందని, మరింతగా 2017లో వృద్ధి అవసరమవుతుందని అభిప్రాయపడ్డారు. ఎక్కువగా ఫిన్‌టెక్‌ కంపెనీలు నిధులు సమీ కరణ సాధించుకోగలుగుతాయని, ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షించగలవని అంచనా. ఆన్‌లైన్‌ డిజిటల్‌ కంటెంట్‌, వినోదరంగం, విద్య వంటివాటిలో ఎక్కువ ఉంటాయి. 4జి రంగంలోని రావడం డేటా ట్యారిఫ్‌ల తగ్గు ముఖం నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వడీఇయో, రిలయన్స్‌జయో వంటి యాప్‌ వ్యాపారాలు, మౌలికవనరులు ఇంటర్నెట్‌ కంపెనీల వృద్ధికి మరింత దోహదం చేస్తాయని అందుకు అనుగుణంగానే నిధుల సమీకరణ ఉంటుందని అంచనా.