మూడు విడతలుగా పంచాయితీ ఎన్నికలు!

panchayat elections
panchayat elections

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రామపంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. 2019, జనవరి, 3, 6, 8 తేదీల్లో మూడు విడతలుగా పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలను జనవరి 10వ తేదీలోగా ముగించాలంటూ ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అంతుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మరో వైపు 60 శాతం రిజర్వేషన్లు సాధనపై మరోసారి హైకొర్టును ఆశ్రయించాలని భావిస్తుంది. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్స్‌లు, పత్రాలు సిద్ధం చేశారు. 60 శాతం రిజర్వేషన్ల సాధనపై సర్కారు ప్రయత్నం చేస్తుంది.