మూడు వికెట్ల్‌ కోల్పోయిన ఆసీస్‌

australia
australia

మెల్‌బోర్న్‌: టీమిండియా- ఆసీస్‌ మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఓపెనర్లను ఔట్‌ చేసి ఆసీస్‌ను దెబ్బకొట్టిన కోహ్లీసేన..తాజాగా మరో కీలక వికెట్‌ను పడగొట్టింది. క్రీజులో పాతుకు పోయి భారత బౌలర్లకు తలనొప్పిగా మారిన ఉస్మాన్‌ ఖవాజా(33)ను షమీ బయటకు పంపాడు. 21వ ఓవర్లో షమీ వేసిన ఆఖరు బంతికి ఖవాజా ఎల్బీగా వెనుదిరిగాడు. 21ఓవర్లు పూర్తి చేసుకున్న ఆసీస్‌ మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది.