మూడు లోక్‌సభ స్థానాలకు బిజెపి అభ్యర్ధుల ఖరారు

BJP
BJP

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ మూడు లోక్‌సభస్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు అభ్యర్ధులనుప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో రెండుసీట్లు, బీహార్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గోరఖ్‌పూర్‌, ఫుల్‌ఫూర్‌ ఉత్తరప్రదేశ్‌లోను, బీహార్‌లో ఆరైరాస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు మార్చి 11వ తేదీ జరుగుతాయి. పార్టీ వారణాసి మాజీ మేయర్‌ కౌశలేంద్రసింగ్‌ పటేల్‌ను ఫుల్ఫూర్‌ నియోజకవర్గం అభ్యర్ధిగాను, ఉపేంద్ర శుక్లాను గోరక్‌పూర్‌ అభ్యర్ధిగాను పోటీకి దించింది. ఇక బీహార్‌లోని ఆరారియా లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపి ్కరపనదీప్‌కుమార్‌సింగ్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది.రాష్ట్రీయ జనతాదళ్‌ అభ్యర్ధిగా సర్ఫరాజ్‌ ఆలమ్‌ను ప్రకటించింది. మాజీ ఎంపి మహ్మద్‌ తస్లీముద్దీన్‌ కుమారుడు సర్ఫరాజ్‌.ఉత్తరప్రదేశ్‌లోని రెండు స్థానాలకు సమాజ్‌వాదిపార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులనుప్రకటించాయి. గోరక్‌పూర్‌ ఉప ఎన్నికల్లో పీస్‌పార్టీ, నిషాద్‌పార్టీతో కలిసి పోటీచేస్తోంది. ప్రవీణ్‌కుమార్‌ నిషాద్‌ను తమ అభ్యర్ధిగా ప్రకటించాయి. నిషాద్‌పార్టీ అధినేత సంజ§్‌ు నిషాద్‌కుమారుడు ప్రవీణ్‌. ఫుల్ఫూర్‌ స్థానంలో నాగేంద్రప్రతాప్‌సింగ్‌ పటేల్‌ను అభ్యర్ధిగా నిలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మనీష్‌ మిశ్రాను ఫుల్ఫూర్‌ అభ్యర్ధిగా ఎంపికచేసింది. సుర్‌హిత ఛటర్జీ కరీమ్‌ను గోరక్‌పూర్‌కు ఎంపికచేసింది. ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ స్థానాల్లో ఎంపి యోగి ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రిగాఎన్నికకావడం, ఫుల్పూర్‌ ఎంపి కేశవ్‌ప్రసాద్‌మౌర్య డిప్యూటి సిఎంగా నియమితులు కావడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఆదిత్యనాధ్‌ గోరఖ్‌పూర్‌కు ఐదుసార్లు ఎన్నికయ్యారు. అరారియా స్థానం ఆర్‌జెడి నేత ఎంపి ముహ్మద్‌ తస్లీముద్దీన్‌ సెప్టెంబరులో మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. నామినేషన్ల దాఖలుకు ఈ మూడు నియోజకవర్గాల్లోను ఈనెల 20వ తేదీ చివరితేదీగా నిర్ణయించారు. ఉపసంహరణ ఈనెల 23వ తేదీ చివరిరోజుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.